Begin typing your search above and press return to search.

క్షీణిస్తున్న హెరిటేజ్ షేర్‌.. రీజ‌నేంటి?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబానికి చెందిన `హెరిటేజ్ ఫుడ్స్` షేర్లు అలా ఎగిసి.. ఇలా దిగువ‌కు ప‌డుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Jun 2024 8:13 AM GMT
క్షీణిస్తున్న హెరిటేజ్ షేర్‌.. రీజ‌నేంటి?
X

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబానికి చెందిన `హెరిటేజ్ ఫుడ్స్` షేర్లు అలా ఎగిసి.. ఇలా దిగువ‌కు ప‌డుతున్నాయి. ఈ ప‌రిణామం.. స్టాక్ మార్కెట్ రంగంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. ద‌క్షిణాది రాష్ట్రాలు స‌హా ఢిల్లీలోనూ.. హెరిటేజ్ రిటైల్ సంస్థ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. వీటికి స్టాక్ మార్కెట్‌లోనూ మంచి పేరుంది. అయితే.. గ‌త 2014-19 మ‌ధ్య కొంత పుంజుకున్న‌ప్ప‌టికీ.. టీడీపీ అధికారం కోల్పోయేనాటికి.. షేర్ మార్కెట్ లో హెరిటేజ్ విలువ 300ల‌కు ప‌డిపోయింది. త‌ర్వాత‌.. ఎన్డీయే కూట‌మితో చేరిన ద‌రిమిలా.. ఇది నెమ్మ‌ది నెమ్మ‌దిగా పుంజుకుంది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో చంద్రబాబు కుటుంబానికి 35.71% వాటా ఉన్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన‌ ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ కూట‌మి వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపించార‌న్న వార్త‌ల‌తో హెరిటేజ్ షేర్లు పుంజుకోవ‌డం ప్రారంభ‌మైంది. ఇక , ఫ‌లితాలు విడుద‌లై.. టీడీపీ కూట‌మి ఘ‌న విజ‌యం దక్కించుకున్న ద‌రిమిలా.. ఈ షేర్లు ఆకాశానికి దూసుకుపోయాయి. ఒకానొక సంద‌ర్భంలో `ఆల్ టైమ్ హై`కి చేరాయి. రోజు రోజుకు ఈ షేర్లు అనూహ్యంగా పెరుగుతూ వ‌చ్చాయి.

ఎప్పుడెప్పుడు ఎలా ఎలా?

మే 2వ తేదీన షేర్ ధర రూ.333.85

జూన్ 3వ తేదీన రూ.441

జూన్ 4వ తేదీన రూ.479.80

జూన్ 10వ తేదీన రూ.727.35

అనూహ్యంగా డౌన్‌!

అయితే. ఒక్క‌సారి పుంజుకున్న హెరిటేజ్ షేర్లు.. అనూహ్యంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. జూన్ 10న రూ.727.35 గా ఉన్న షేర్ 12వ తేదీనాటికి రూ.627.30కు త‌గ్గింది. 13న తేదీ గురువారం ఉదయం నాటికి రూ.601.35ల వద్ద నమోదయింది. అంటే.. దాదాపు 130 రూపాయ‌ల వ‌ర‌కు త‌గ్గిపోయింది.

ఎందుకిలా?

సాధార‌ణంగా.. మ‌దుప‌రులు లాభాల కోసం వేచి చూస్తారు. ఎన్నాళ్లుగానో.. డౌన్‌గా ఉన్న ఈ ట్రెండ్ ఒక్క‌సారిగా పుంజుకోవ‌డంతో లాభాలను వెన‌క్కి తీసుకునేందుకు మ‌దుప‌ర్లు.. ప్ర‌య‌త్నించారు. అంటే వ‌చ్చిన లాభాల‌ను వ‌చ్చిన‌ట్టు వెన‌క్కి తీసేసుకున్నారు. దీంతో లాభాల్లో ఉన్న షేర్లు కాస్తా.. కొంత త‌గ్గుముఖం ప‌ట్టాయి. కాగా.. చంద్ర‌బాబు కుటుంబానికి హెరిటేజ్ కంపెనీలో 35.71 శాతం వాటా ఉంది.

ఎవ‌రి వాటా ఎంత‌?

నారా భువనేశ్వరి - 24.37%

నారా లోకేష్ - 10.82%,

నారా బ్రాహ్మణి - 0.46%

నారా దేవాన్ష్ - 0.06%