Begin typing your search above and press return to search.

హెరిటేజ్ షేర్లకు రెక్కలు.. బాబు ఫ్యామిలీకి రూ.1200 కోట్లు ప్రాఫిట్!

ఈ క్రమంలో హెరిటేజ్ షేర్లు 12 రోజుల్లోనే 100 శాతం రాబడిని అందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 1:09 PM GMT
హెరిటేజ్ షేర్లకు రెక్కలు.. బాబు ఫ్యామిలీకి రూ.1200 కోట్లు ప్రాఫిట్!
X

ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల్లో సృష్టించిన ప్రభంజనం స్టాక్ మార్కెట్ ను తాకిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా బిజినెస్ వర్గాల్లో ఇది ఆసక్తికర అంశంగా మారింది. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా నారా వారి ఫ్యామిలీ మెంబర్స్ కి పెరుగుతున్న ఆస్తులు కూడా వైరల్ గా మారాయి. ఈ క్రమంలో హెరిటేజ్ షేర్లు 12 రోజుల్లోనే 100 శాతం రాబడిని అందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏ స్థాయి విక్టరీ సాధించిందనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమిలోనూ చంద్రబాబు కీలకంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు కూడా ఊహించని లాభాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కుటుంబం ప్రమోట్ చేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు సోమవారం 10% పెరిగి రూ.727.90కి చేరాయి.

దీంతో... హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ షేర్లు గడచిన 12 రోజుల్లోనే పెట్టుబడిదారుల సొమ్ముకు 100% రాబడిని అందించాయన్నమాట. వాస్తవానికి ఈ ఏడాది మే 23న కంపెనీ షేర్లు రూ.354.50 వద్ద ముగిశాయి. కట్ చేస్తే... జూన్ 10 (ఈ రోజు)న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ఒక్కోటి రూ.727 మర్కును దాటాయి.

మార్చి నాటికి హెరిటేజ్ ఫుడ్స్ లో చంద్రబాబు భార్య భువనేశ్వరి వాటా 24.37%, ఆయన కుమారుడు లోకేష్ 10.82% వాటాను కలిగి ఉన్నారు. ఈ క్రమంలోనే 2024 మే 23 నాటికి కంపెనీలో భువనేశ్వరి + లోకేష్ ల వాటాల విలువ రూ.1100 కోట్లకు పైగా ఉందని అంటున్నారు. అయితే ఇటీవల హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు పెరిగిన తర్వాత వారు హోల్డ్ చేస్తున్న వాటాల విలువ రూ.2,300 కోట్లకు పైగా చేరింది.