Begin typing your search above and press return to search.

ముంబై జుహూ లా వైజాగ్ బీచ్..ప్లాట్ల కోసం హీరోలు పోటీ!

ముంబై జుహూ త‌ర‌హాలో వైజాగ్ బీచ్ వ్యూ రెడీ అవుతోందా? బాలీవుడ్ హీరోల త‌ర‌హాలో టాలీవుడ్ హీరోలు బీచ్ వ్యూ అపార్ట్ మెంట్ల కోసం పోటీ ప‌డుతున్నారా?

By:  Tupaki Desk   |   22 Sep 2024 5:30 PM GMT
ముంబై జుహూ లా వైజాగ్ బీచ్..ప్లాట్ల కోసం హీరోలు పోటీ!
X

ముంబై జుహూ త‌ర‌హాలో వైజాగ్ బీచ్ వ్యూ రెడీ అవుతోందా? బాలీవుడ్ హీరోల త‌ర‌హాలో టాలీవుడ్ హీరోలు బీచ్ వ్యూ అపార్ట్ మెంట్ల కోసం పోటీ ప‌డుతున్నారా? విశాఖ ఇప్పుడు బీచ్ వ్యూ డెవ‌లెప్ మెంట్ పై మ‌రింత శ్ర‌ద్ద‌గా ఉందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ముంబై జుహూ బీచ్ వ్యూ కి ఎదురుగా దాదాపు అక్క‌డ స్టార్ హీరోలందరికీ ల‌గ్జ‌రీ అపార్ట్ మెంట్లు ఉన్నాయి. హృతిక్ రోష‌న్, స‌ల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ , అక్ష‌య్ కుమార్ ఇలా స్టార్ హీరోలంద‌రికీ ఖ‌రీదైన అపార్ట్ మెంట్ లు ఉన్నాయి.

కొందరు హీరోలు విల్లాలు కూడా నిర్మించి వాటిని అద్దెకిచ్చి కూడా డ‌బుల్ ఆదాయం పొందుతున్నారు. ఉండాల‌నుకున్న వారు అక్క‌డ ఉంటున్నారు లేదంటే? స్నేహితుల‌కో..తోటి హీరోల‌కే అదే ప్లాట్ అద్దెకిచ్చి ల‌క్ష‌ల్లో ఆదాయం అందుకుంటున్నారు. జుహూ ప్రాంతంలో అతిపెద్ద రియ‌ల్ వెంచ‌ర్లు ఎన్నో వెలిసాయి. నిత్యం అక్క‌డ అపార్ట్ మెంట్ల క్ర‌య‌, విక్ర‌యాలు జ‌రుగుతూనే ఉంటాయి. తాజాగా విశాఖ బీచ్ ఏరియా కూడా అలాంగి సొగ‌బుల‌కు ముస్తాబ‌వుతోంది.

ఇప్ప‌టికే భీమిలి నుంచి ఆర్కే బీచ్ వ‌ర్కూ ఎన్నో ఖ‌రీదైన క‌ట్ట‌డాల నిర్మాణం స్పీడందుకుంది. వాటిలో కొంత మంది స్టార్ హీరోలు ప్లాట్ లు బుక్ చేసుకున్నారు. ఇది రెండేళ్ల కాలంగా జ‌రుగుతోంది. తాజాగా ఆ బీచ్ వ్యూలో మ‌రిన్ని కొత్త విల్లాలు..అపార్ట్ మెంట్ల నిర్మాణం శ‌ర వేగంగా జ‌ర‌గ‌డంతో వాటిలో ప్లాట్లు కొన‌డానికి స్టార్ హీరోలు పోటీ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్ర‌భాస్ ఇలా స్టార్ హీరోలంతా ఓప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీతో కొనుగోలు విష‌యంలో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

స‌రిగ్గా బీచ్ వ్యూ ని అనుకుని ఉన్న ప్లాట్ లు ఉండేలా ప్లాట్ లు నిర్మాణం ఉండేలా? చూడాల‌ని సూచించారుట‌. ఆ రియ‌ల్ నిర్మాణం చేప‌ట్టింది కూడా ఓ పాన్ ఇండియా స్టార్కి చెందిన కుటుంబ స‌భ్యుల‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు న‌చ్చిన విధంగా ఆ ప్రాంతంలో అపార్ట్ మెంట్ నిర్మాణం చేప‌డుతున్నారుట‌. అదే ప్రాంతంలో కొన్ని విల్లాలు కూడా ప్లాన్ చేస్తున్నారుట‌. రానున్న రెండేళ్ల‌లో వాటి నిర్మాణం మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.