Begin typing your search above and press return to search.

పేరు.. పార్టీ ఆఫ్ గాడ్.. తీరు.. భయంకర ఉగ్రవాదం.. అదే హెజ్బొల్లా

ఇజ్రాయెల్ ను ప్రతిఘటిస్తూ లెబనాన్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపన హెజ్బొల్లా లక్ష్యం. అమోరికా, యూరోపియన్ యూనియన్లు దీనిని తీవ్ర వాద సంస్థ గా ముద్ర వేశాయి.

By:  Tupaki Desk   |   5 Aug 2024 11:30 PM GMT
పేరు.. పార్టీ ఆఫ్ గాడ్.. తీరు.. భయంకర ఉగ్రవాదం.. అదే హెజ్బొల్లా
X

అది ఫుట్ బాల్ మైదానం.. కొందరు పిల్లలు, యువకులు సాయంత్రం వేళ సరదాగా ఆడుకుంటున్నారు.. అంతలోనే ఓ క్షిపణి దూసుకొచ్చింది. మైదానంలో బంతితో ఆడుతున్న పిల్లలపై పడింది. అంతే.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి కర్కశ దాడికి దిగిన సంస్థ.. ఎంతటి తీవ్ర స్థాయి ఉగ్రవాద సంస్థనో తెలిసిపోతోంది. అఫ్ కోర్స్.. అవతలి పక్షం కూడా ఇదే స్థాయిలో దాడులు చేస్తోంది అనుకున్నా.. వారు చేసినదీ తప్పే. వీరు చేసినదీ తప్పే.

హెజ్బొల్లా..ఇరాన్-ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య ఘర్షణల్లో తరచూ వినిపిస్తున్న పేరు హెజ్జొల్లా. ఇదొక లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న భయంకర ఉగ్ర సంస్థ. అంతేకాదు.. ఇరాన్ దీనికి పూర్తి మద్దతుదారు. షియా ముస్లిం మిలిటెంట్ సంస్థ అయిన హెజ్బొల్లా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో వేలు పెట్టింది. దీనిని 1985లో స్థాపించారు. ఇస్లామిక్ విప్లవం అంనతరం ఇరాన్ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రభావానికి గండికొట్టే ఉద్దేశంతో హెజ్బొల్లాకు పురుడు పోసింది. 1982లోనే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్, సిరియా మద్దతుతో హెజ్బొల్లా ఏర్పడింది.

ఇజ్రాయెల్ ను ప్రతిఘటిస్తూ లెబనాన్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపన హెజ్బొల్లా లక్ష్యం. అమోరికా, యూరోపియన్ యూనియన్లు దీనిని తీవ్ర వాద సంస్థ గా ముద్ర వేశాయి. ఇంతకూ హెజ్బొల్లా అంటే పార్టీ ఆఫ్ గాడ్ అని అర్థం. కాగా, ఈ సంస్థ ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేస్తుండగా.. దానిని ఐరన్ డోమ్ తో అడ్డుకుంటోంది.

ఆ మూడు సంస్థలతో ప్రాక్సీ నెట్ వర్క్ ఇజ్రాయెల్ దాడిలో ఇటీవల హెజ్జొల్లా కీలక నేత షుకూర్ చనిపోయాడు. దీంతో ఆ సంస్థ మరింత రగిలిపోతోంది. ఇరాన్ గనుక ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగితే అందులో ప్రధాన పాత్ర హెజ్బొల్లాదే అవుతుంది. హూతీలు, హమాస్, హెజ్బొల్లా ఈ మూడూ కలిసి ఇరాన్ కు అండగా నిలిచి ఇజ్రాయెల్ ను ఓడించాలని చూస్తున్నాయి. పరోక్షంగా రష్యా కూడా రంగంలోకి దిగుతోంది. అందుకే అమెరికా, యూకేలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అబ్రహాం కూటమిని ఏర్పాటు చేద్దామంటూ ప్రతిపాదన చేశారు . ఇదీ హెజ్బొల్లా, హౌతీలు, హమాస్ లతో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రాక్సీ నెట్ వర్క్ కు దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం.