Begin typing your search above and press return to search.

హెచ్-1బీ హోల్డర్ ముందస్తు రాజీనామాపై భారీ పెనాల్టీ... చట్టం ఏమి చెబుతోంది!?

అవును... ఒహియోలో ఓ హెచ్-1బీ ఉద్యోగి ఊహించన్ని ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 6:13 AM GMT
హెచ్-1బీ హోల్డర్  ముందస్తు రాజీనామాపై భారీ పెనాల్టీ... చట్టం ఏమి  చెబుతోంది!?
X

సాధారణంగా ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావిస్తే ఆయా కంపెనీ రూల్స్ ప్రకారం ముందుగా నోటీసు పిరియడ్ ఇస్తారు.. మరికొన్ని కంపెనీల్లో ఆ సమస్య ఉండదు.. వర్క్ చేస్తున్న చివరి నెలలో ఇంటిమేట్ చేసినా సరిపొతుందని అంటుంటారు. అయితే తాజాగా యూఎస్ లోని ఓ వ్యక్తి ముందస్తు రాజీనామా చేసినందుకు భారీ పెనాల్టీని ఎదుర్కొన్నాడు.

అవును... ఒహియోలో ఓ హెచ్-1బీ ఉద్యోగి ఊహించన్ని ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నాడు. ఇందులో భాగంగా.. ఉద్యోగ ప్రతిపాదన లేఖలో కంపెనీతో ఓ సంవత్సరం పార్టు ఉద్యోగం పూర్తి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడట. అయితే... ఆ అగ్రిమెంట్ పూర్తి కాకముందే ముందస్తుగా రాజీనామా చేయాలని భావించారు.

దీంతో... రాజీనామా చేస్తే లిక్విడేటెడ్ నష్టపరిహారం కోసం 15,000 డాలర్లు చెల్లించాలని సంస్థ పేర్కొంది. దీంతో... ఇలాంటి నిబంధన అమలూ చేయబడుతుందా.. ముందుగానే రాజీనామా చేసినందుకు ఈ స్థాయిలో చట్టపరమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అనే చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారం... యజమానులు తమ ఒప్పందం ముగిసేలోపు తమ ఉద్యోగాన్ని ముగించే హెచ్-1బీ వీసాదారుల నుంచి జరిమానాలు వసూలు చేయకుండా నిషేదించబడ్డారని అంటున్నారు. అయితే... వీటికి కొన్ని టెరంస్ అండ్ కండిషన్స్ ఉన్నాయి.

యునైటెడ్ స్టేట్స్ లోని చట్టం లిక్విడేటెడ్ నష్టపరిహార నిబంధనలను చట్టబద్ధంగా అమలు చేసే నిబంధనలు సహేతుకంగా ఉండాలి. ఇదే సమయంలో ఉద్యోగి సంపాదనతో పోలిస్తే ఆ పెనాల్టీ అసమంజసంగా అనిపిస్తే మొత్తం మోసం లేదా అణిచివేత ఫలితంగా ఏర్పడిన ఒప్పందంగా భావిస్తారు. ఇలాంటి ఒప్పందాన్ని కోర్టు చెల్లదని తీర్పుస్తుందని అంటున్నారు.

ఈ విషయాలపై స్పందించిన న్యాయనిపుణులు... ఉద్యోగంలో చిక్కుకున్న అనుభూతి తగినంత ఒత్తిడితో కూడుకున్నది.. దానికి వేల డాలర్ల జరిమానాలు విధించినప్పుడు వదిలేయడం అసాధ్యం అని.. అలాటి సందర్భంగాల్లో కోర్టులో కాంట్రాక్ట్ పై స్టే తెచ్చుకోవాలి.. లేదా పోరాడాలని తెలిపారు!