Begin typing your search above and press return to search.

కాశ్మీర్ లో భారీ పోలింగ్...ఎవరికి అధికారం ?

ఇది గతానికంటే కూడా భిన్నమైనదే. కాశ్మీర్ లో ఈసారి ప్రజలు ఉత్సాహంలో పోలింగ్ లో పాలు పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 3:44 AM GMT
కాశ్మీర్ లో భారీ పోలింగ్...ఎవరికి అధికారం ?
X

జమ్మూ కాశ్మీర్ లో భారీ పోలింగ్ జరిగింది. ఈసారి మూడు విడతలుగా ఎన్నికలు జరిగితే ప్రతీ విడతలోనూ అరవై అయిదు శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. అంటే సగటున 65 శాతం పైగా పోలింగ్ రేటు ఉంది అన్న మాట.

ఇది గతానికంటే కూడా భిన్నమైనదే. కాశ్మీర్ లో ఈసారి ప్రజలు ఉత్సాహంలో పోలింగ్ లో పాలు పంచుకున్నారు. ఎక్కువగా యువత కూడా ఓట్లు వేసింది. అంతే కాదు ప్రతీ పోలింగ్ బూత్ లో చూస్తే కనుక ఓటర్లతో పూర్తిగా నిండిపోయింది.

ఈ నేపధ్యంలో కాశ్మీర్ లో ఇది భారీ మార్పు గానే చూస్తున్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు రావడం అన్నది ప్రజాస్వామ్యానికి దక్కిన తొలి విజయం అని అంటున్నారు. గతంలో తుపాకీ తూటాల మధ్య పోలింగ్ ని మమ అనిపించారు.

కేవలం పదిహేను శాతం దాకా పోలింగ్ అయ్యేది. దాంతోనే అధికారంలోకి పార్టీలు వచ్చేవి. కానీ ఈసారి అలా కాదు ఉవ్వెత్తిన ఉత్సాహం కనిపిస్తోంది. మహిళలు బాగా పోలింగ్ బూతుల వద్ద సందడి చేశారు. అన్ని వర్గాల ప్రజలు పోలింగ్ వైపు పరుగులు తీశారు. అలా కనుక చూసుకుంటే వారి బాడీ లాంగ్వేజ్ కూడా ఈసారి కొత్తగా ఉంది అని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు.

ఇక రాజకీయ పార్టీలు కూడా ఓటర్లలో ఆసక్తిని పెంచాయి. పెద్ద ఎత్తున చేసిన ప్రచారం వల్ల కూడా పోలింగ్ శాతం పెరిగింది అని చెప్పాల్సి ఉంది. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అలాగే మరో రెండు ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటివి ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఎన్సీపీ ప్లస్ కాంగ్రెస్ కూటమిగా ఉన్నాయి. పీడీపీ వేరేగా పోటీ చేస్తోఅంది.

బీజేపీది ఒంటరి పోరాటంగా ఉంది. బీజేపీకి జమ్మూలో బలం ఉంది. అక్కడ ఉన్న 43 సీట్లను ఆ పార్టీ నమ్ముకుంది. కాశ్మీర్ లోయలో ఎన్సీపీదే ఆధిపత్యంగా ఉంది. ఇక జమ్మూలో బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ముఖాముఖీ పోరు సాగుతోంది.

ఈసారి 370 ఆర్టికల్ రద్దు మీద జనాలు తీర్పు ఎలా ఉంటుంది అన్నది చర్చగా ఉంది. అలాగే కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి అవసరమా కాదా అన్నది కూడా చర్చనీయాంశం. అలాగే అనేక దశాబ్దాలుగా ఉగ్రవాద కోరలలో చిక్కుకున్న కాశ్మీర్ లో ఇపుడిపుడే అభివృద్ధి వైపుగా జనాలు మొగ్గు చూపిస్తున్నారు.

దాంతో అభివృద్ధికి ఓటు పడితే అది ఏ పార్టీని అధికారంలోకి తెస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. పైకి అన్ని పార్టీలలో ధీమా ఉన్నా ఓటర్ల నాడి తెలియక అందరూ తికమక పడుతున్నారు. బీజేపీ గెలిస్తే చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.

అలాగే కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి ప్రభుత్వం వస్తుందని భావిస్తోంది. పీడీపీ తన సీట్లను కూటమికి మద్దతు ఇచ్చి ఆ ప్రభుత్వంలో చేరాలని అనుకుంటోంది. మొత్తానికి ఈసారి ఇండిపెండెంట్లు చిన్న పార్టీలు కూడా సత్తా చూపుతాయని భావిస్తున్న క్రమంలో వారి మద్దతు తీసుకుని అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఈ నెల 8న కాశ్మీర్ ఫలితాలు వస్తాయి. ఇక అక్టోబర్ 5న హర్యానా ఎన్నికలు ఉన్నాయి. ఆ రోజు రాత్రి నుంచి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. దాంట్లో కాశ్మీర్ లో ఎవరిది విజయం అన్నది ఒక స్పష్టత వస్తుంది. చూడాలి మరి కాశ్మీర్ ఎవరి పరం అవుతుందో.