Begin typing your search above and press return to search.

రెండు చేపలు .. రూ.4 లక్షలు

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు.

By:  Tupaki Desk   |   15 April 2024 1:30 AM GMT
రెండు చేపలు .. రూ.4 లక్షలు
X

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒకచేప ఎండలేదు. అనే ఈ చేపల కథ అందరికీ గుర్తుంటుంది కదూ.

కానీ మన గోదావరి జిల్లాలలో దొరికే అరుదయిన చేపల గురించి మనం కథలు కథలుగా చెప్పుకుంటాం. గోదావరి సముద్రంలో కలిసే సంగమంలో అరుదుగా దొరికే చేపలకు కళ్లు చెదిరే ధర ఉంటుంది. ఏడాదికి ఒకసారి దొరికే పులస చేపల ధర వింటేనే మనం అమ్మో అనుకుంటాం. కానీ తాజాగా వేటలో కేవలం రెండే చేపలు దొరికాయి. కానీ ఊహించని ధర పలికాయి.

కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో 2 కచ్చిడీ చేపలు పడ్డాయి. అరుదైన ఈ చేపలను ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేయగా ఈ రెండు చేపలను ఓ వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ కట్టినా చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్‌ ను ఔషధాల తయారీలో, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారం తయారీకి ఉపయోగిస్తారని తెలుస్తుంది. అందుకే వీటికి ధర బాగా పలుకుతుంది.