Begin typing your search above and press return to search.

జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రయాణించడానికి అనుకూలంగా లేదని జగన్ తరుపు న్యాయవాది శ్రీరాం కోర్టుకు తెలిపారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 9:16 AM GMT
జగన్  బుల్లెట్  ప్రూఫ్  కారుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఏపీ పోలీస్ శాఖ... జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని, భద్రత తగ్గించారంటూ ఆయన చేస్తున్న వాదన నిజం కాదని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్దరించాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే! ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రయాణించడానికి అనుకూలంగా లేదని జగన్ తరుపు న్యాయవాది శ్రీరాం కోర్టుకు తెలిపారు.

ఇదే సమయంలో జామర్ వెహికల్ కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం... జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా స్పందించిన అడ్వకేట్ జనరల్... ప్రత్యామ్నాయ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, జామర్ వెహికల్ ఇచ్చే విషయంలో అధికారులను అడిగి వివరాలు సమర్పిస్తామని తెలిపారు.

కాగా... 2024 జూన్ 3 నాటికి ఉన్న భద్రతను పునరుద్దరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం నెల రోజుల్లోనే తన భద్రతను తగ్గించారని ఆయన తెలిపారు. భద్రతను పునరుద్దరించాలని కోరారు. మరోపక్క దీనిపై రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసగుతూనే ఉన్నాయి.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ సెక్యూరిటీని తగ్గించిందని, దీనివెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు! మరోపక్క... పులివెందుల ఎమ్మెల్యేకి.. సీఎంకి, పీఎం కి ఇచ్చినంత సెక్యూరిటీ ఇవ్వరని కూటమి నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.