Begin typing your search above and press return to search.

కన్యాదానం కంపల్సరీ కాదు.. అల్లుడికి షాకిచ్చిన హైకోర్టు!

ఇదే సమయంలో... కన్యదానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని కూడా పెద్దలు చెబుతారు.

By:  Tupaki Desk   |   9 April 2024 2:45 AM GMT
కన్యాదానం కంపల్సరీ కాదు.. అల్లుడికి షాకిచ్చిన హైకోర్టు!
X

హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో.. వరుడి కాళ్లు కడిగిన వధువు తల్లితండ్రులు కన్యాదానం చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తోన్న ఆచారం! వరుడిని శ్రీమహావిష్ణువు అవతారంగా భావించి, లక్ష్మీదేవి స్వరూపంగా తమ కూతురిని అల్లుడికి దానం ఇస్తారు. దీన్నే కన్యాదానం అని అంటారు. ఇదే సమయంలో... కన్యదానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని కూడా పెద్దలు చెబుతారు. అయితే... కన్యాదానం తప్పనిసరేమీ కాదని అంటుంది హైకోర్టు!

అవును... హిందూ వివాహ వ్యవస్థలో కన్యాదానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెబుతుండగా... వివాహ చట్టం ప్రకారం కన్యాదానం కంపల్సరీ కాదని కోర్టు చెబుతోంది! ఓ కేసు విషయపై అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా... హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కన్యాదానం చేయడం తప్పనిసరి కాదని, సప్తపది పెళ్లిలో తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమం అని జస్టిస్ సుభాశ్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది!

వివరాళ్లోకి వెళ్తే... అశుతోష్ యాదవ్ అనే వ్యక్తిపై అతడి అత్తామామలు క్రిమినల్ కేసు పెట్టారు. ఈ సమయంలో తన వాదనలు వినిపించిన అశుతోష్... హిందూ వివాహ చట్ట ప్రకారం కన్యాదానం చేయాల్సి ఉండగా, అత్తమామలు తన విషయంలో అది చేయలేదని, కాబట్టి తన పెళ్లి చట్టబద్ధం కాదని కోర్టు ముందు వాదించాడు. ఇదే సమయంలో లక్నో బెంచ్ లో రివిజన్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు.

ఈ నేపథ్యంలో... హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కన్యాదానం చేయడం తప్పనిసరి కాదని ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఆ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం సప్తపది మాత్రం తప్పనిసరి అని కోర్టు తెలిపింది.