లోక్ సభ .. 1996 తర్వాత !
1996 లోక్ సభ ఎన్నికల తర్వాత తిరిగి ప్రస్తుత 2024 ఎన్నికలలో లోక్ సభ బరిలో అత్యధికంగా 8360 మంది పోటీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
By: Tupaki Desk | 24 May 2024 7:06 AM GMT1996 లోక్ సభ ఎన్నికల తర్వాత తిరిగి ప్రస్తుత 2024 ఎన్నికలలో లోక్ సభ బరిలో అత్యధికంగా 8360 మంది పోటీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 13,952 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2019 లోక్ సభ ఎన్నికలలో 8,039 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 1,874 మంది మాత్రమే పోటీ చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు నాలుగింతలకు పైగా పెరిగింది. 1952లో సగటున ఒక్కో నియోజకవర్గానికి 4.67 మంది బరిలో ఉండగా ఇప్పుడు 15.39 మంది పోటీ చేస్తుండడం గమనార్హం.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో 80 ఏండ్ల పైబడిన వారు 11 మంది పోటీ చేస్తుండగా, 25-30 ఏండ్ల మధ్య వయసు గల వారు 537 మంది పోటీలో ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు కాగా, 359 మంది ఐదో తరగతి వరకు, 647 మంది 8వ తరగతి వరకు, 1,303 మంది 12వ తరగతి వరకు చదువుకున్నారు. అలాగే 1,502 మంది గ్రాడ్యుయేట్లు, 198 మంది డాక్టరేట్లు ఎన్నికల సమరంలో పోటీ చేస్తున్నారు.