కొట్టుకున్న వైసీపీ - టీడీపీ కార్యకర్తలు... కారణం ఇదే!
అవును... మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యా రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడంతో ఒంగోలు లోని సమతానగర్ లో తీవ్ర రచ్చ జరిగింది!
By: Tupaki Desk | 11 April 2024 8:16 AM GMTఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగా... మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరుపున ఆయన కోడలు ప్రచారం చేస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుపడటంతోనే ఈ ఘర్షణ తలెత్తిందని అంటున్నారు.
అవును... మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యా రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడంతో ఒంగోలు లోని సమతానగర్ లో తీవ్ర రచ్చ జరిగింది! బాలినేని, ఆయన కోడలు కావ్యా రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల్లో ప్రచారంలో రాజీనామా చేసిన ఓ వాలంటీర్ పాల్గొన్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్, ఆయన అనుచరులు, ఇతర టీడీపీ నాయకులు వీరి ప్రచారాన్ని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా... వాలంటీర్ తో ఎందుకు ప్రచారం చేయిస్తున్నారంటూ దామచర్ల అనుచరులు బాలినేని, ఆయన కోడలిని నిలదీశారు. అయితే... సదరు వలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని, ప్రస్తుతం స్వచ్ఛందంగా తమ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్నారని కావ్యారెడ్డి వివరించారు. రాజీనామా చేసి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తోన్నాయని వారి దృష్టికి తీసుకెళ్లారు.
అయినప్పటికీ టీడీపీ నేతలు, కార్యకర్తలు వినిపించుకోలేదని అంటున్నారు. దీంతో మాటా మాటా పెరిగడంతో దాడులకు తెగబడ్డారని చెబుతున్నారు. ఈ సమాయంలో... విషయం తెలిసిన వెంటనే మరికొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు సమతానగర్ కి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ మరింత తీవ్రతరం అయ్యిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యయి!
దీనికి వారు వినిపించుకోలేదు. రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దాడులకు దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమతానగర్‌కు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ మరింత తీవ్రతరం అయింది. ఒకరినొకరు తోసుకున్నారు. కొట్టుకున్నారు. ఈ ఘటనలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో... కొద్దిసేపటికి సమతా నగర్ చేరుకున్న దామచర్ల జనార్ధన్... బాలినేని శ్రీనివాస్ తో వాగ్వివాదానికి దిగారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారిపోయింది. ఈ సమయంలో... సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా గాయపడిన కార్యకర్తలను స్థానిక రింస్ ఆసుపత్రికి తరలించారు!