Begin typing your search above and press return to search.

సంప్రదాయ దేశంలో.. యూనివర్సిటీలో అర్దనగ్నంగా యువతి హల్ చల్!

మహిళలు, యువతులు బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా హిజాబ్ ధరించాలనే ఆదేశాలకు వ్యతిరేకంగా పెద్ద వివాదమే సాగింది.

By:  Tupaki Desk   |   3 Nov 2024 6:26 PM GMT
సంప్రదాయ దేశంలో.. యూనివర్సిటీలో అర్దనగ్నంగా యువతి హల్ చల్!
X

పశ్చిమాసియాలో.. యావత్ గల్ఫ్ లో ఒకప్పుడు ఇరాన్ అత్యంత ఆధునిక దేశం.. యూరప్ దేశాల ప్రభావం ఇరాన్ పై స్పష్టంగా ఉండేది. 1979లో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవానికి ముందు రాజు పరిపాలన సాగేది. దీంతో ఆ దేశం అత్యంత మోడ్రన్ కంట్రీగా పేరు తెచ్చకుంది. మనం యూరప్ దేశాల్లో ఉన్నామా? అన్నంతగా యువత ఫ్యాషన్ ను ఫాలో అయ్యేవారని చెబుతారు. కాగా.. ఇస్లామిక్ విప్లవం అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్ ఇస్లామిక్ రాజ్యంగా అవతరించింది.

కుంకుమ పువ్వు నేల..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంట కుంకుమ పువ్వు. ఇలాంటి పంట 90శాతం ఇరాన్ లోనే పండుతుంది. అందుకే ఈ దేశాన్ని కుంకుమ పువ్వు నేల అంటారు. కాగా, ఇరాన్ లో హిజాబ్ ధారణ ఎంతటి వివాదాస్పదం అయిందో రెండేళ్ల కిందట అందరూ చూశారు. మహిళలు, యువతులు బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా హిజాబ్ ధరించాలనే ఆదేశాలకు వ్యతిరేకంగా పెద్ద వివాదమే సాగింది.

మరోసారి హిజాజ్ రగడ

హిజాబ్ ధరించడం అనే అంశంపై యాసా అమినీ అనే యువతి ఉల్లంఘనలకు పాల్పడడంతో ఇరాన్ నైతిక పోలీసులు శిక్షించడం ఆ యువతి చనిపోవడం ఇరాన్ లో ఘర్షణలకు దారితీసింది. కాగా, హిజాబ్ అంశం మరోసారి ఇరాన్ లో రగడకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. అక్కడి ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. కానీ, దీనిని వ్యతిరేకిస్తూ ఓ యువతి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అది కూడా లో దుస్తులతో యూనివర్సిటీలో తిరుగుతూ హల్ చల్ రేపారు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఘటనపై స్పందించిన అధికారులు.. ఆ యువతికి మతి స్థిమితం లేదని కొట్టి పారేశారు. వారు చెప్పే విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు.

అటు యుద్ధం.. ఇటు అంతర్యుద్ధం

ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తామంటోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపే మరోసారి దాడికి దిగుతామని హెచ్చరిస్తోంది. దీనికి అమెరికా కూడా తనదైన శైలిలో సిద్ధం అవుతోంది. అయితే, ఈలోగానే దేశంలో మరోసారి హిజాబ్ రగడ తలెత్తనుందా? అనే అనుమానలు కలుగుతున్నాయి.