Begin typing your search above and press return to search.

హిజాబ్ పై బ్యాన్ ఎత్తేసిన సిద్దరామయ్య

హిజాబ్ ధరించటంపై గతంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.

By:  Tupaki Desk   |   23 Dec 2023 4:09 AM GMT
హిజాబ్ పై బ్యాన్ ఎత్తేసిన సిద్దరామయ్య
X

హిజాబ్ ధరించటంపై గతంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. హిజాబ్ మీద రాష్ట్రంలో ఉన్న నిషేధాన్ని తాను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. హిజాబ్ పై నిషేధాన్నిఎత్తేసిన నేపథ్యంలో ఎవరికి.. ఎక్కడికైనా హిజాబ్ ను ధరించి వెళ్లొచ్చన్న మాట చెప్పారు.

హిజాబ్ ధరించటంపై ఇక నుంచి ఎలాంటి నిషేధం ఉందని.. దాన్ని ఎత్తుస్తున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందున్నారు. మైసూర్ లో నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో హిజాబ్ పై కర్ణాటక ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకున్నట్లుగా పేర్కొన్నారు. ‘‘మహిళలు వారికి నచ్చితే వాటిని ధరించొచ్చు.హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లొచ్చు. బ్యాన్ ను ఎత్తేస్తున్నాం. మహిళలు ఏం డ్రెస్ వేసుకుంటారు. వారేం తింటారన్నదివారి వ్యక్తిగత ఎంపిక’’ అని పేర్కొన్నారు.

ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు హిజాబ్ ను ధరించొచ్చన్న సీఎం సిద్ధరామయ్య.. ‘‘నేను ఎందుకు అడ్డుకోవాలి?’’ అని ప్రశ్నించారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం బసవరాజు బొమ్మై హిజాబ్ పై బ్యాన్ విదించటం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు సైతం.. హిజాబ్ ధరించే విషయంలో ఇస్లాం ప్రకారం తప్పనిసరిగా ధరించాలన్న నియమం ఏమీ లేదని పేర్కొన్నారు. మొత్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తన సంచలన నిర్ణయంతో నిలిపేశారని చెప్పాలి.