తెలంగాణ టు బ్రిటన్.. కల్వకుంట్ల హిమాన్షు దోస్త్.. కియర్ స్మార్టర్
వరకు చరిత్రలో ఎన్నడూ ఎరుగనంతటి స్థాయిలో 121 సీట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో లేబర్ పార్టీ రికార్డు స్థాయిలో 411 స్థానాలో గెలిచింది.
By: Tupaki Desk | 6 July 2024 8:26 AM GMTబ్రిటన్ ఎన్నికల్లో గాలి మారింది. ఇంగ్లిష్ గడ్డపై సరికొత్త రాజకీయం మొదలైంది.. పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ ల పాలనకు లేబర్ పార్టీ అధినేత కీర్ స్మార్టర్ చరమగీతం పాడారు. వాస్తవానికి రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్ లు నాలుగేళ్ల కిందటి వరకు దుర్బేధ్యంగా కనిపించారు. కానీ.. కొవిడ్ సమయంలో మందు పార్టీలు చేసుకున్న బోరిస్ జాన్సన్, మినీ బడ్జెట్ అంటూ లిజ్ ట్రస్ చేసిన ప్రహసనంతో ఆ పార్టీ పతనం మొదలైంది. చివరకు చరిత్రలో ఎన్నడూ ఎరుగనంతటి స్థాయిలో 121 సీట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో లేబర్ పార్టీ రికార్డు స్థాయిలో 411 స్థానాలో గెలిచింది.
కల్వకుంట్లకు కియర్ కు సంబంధం
బ్రిటన్ ఎన్నికల్లో విజయం అనంతరం స్టార్మర్ ప్రధాని అయ్యారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. అది.. భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ సీం కేసీఆర్ మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావుకు సంబంధించినది. సరిగ్గా స్టార్మర్ ప్రధాని అయిన సమయానికి హిమాన్షు తన ట్విటర్ ఖాతాలో స్టార్మర్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందున అభినందించారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. 61 ఏళ్ల స్టార్మర్, నిండా 18 ఏళ్లు నిండని హిమాన్షుకు ఎలా పరిచయం అనే ప్రశ్న వచ్చింది.
ఆ స్టడీ టూర్ లో..
మన లోక్ సభలాగా బ్రిటన్ లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్. తాజా ఎన్నికలు జరిగింది దీనికే. కాగా, హౌస్ ఆఫ్ కామన్స్ పై అకడమిక్ స్టడీ టూర్ కోసం నిరుడు లండన్ వెళ్లాడు కల్వకుంట్ల హిమాన్షు. ఆ సందర్భంగా స్టార్మర్ బ్రిటన్ లో ప్రితిపక్ష నేతగా ఉన్నారు. దీంతో ఆయనను హిమాన్షు కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో ఫొటో కూడా దిగాడు. కాగా, హాల్బర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడోసారి గెలిచిన స్టార్మర్ బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఈ నేపథ్యంలో స్టార్మర్ తో కలిసి దిగిన ఫొటోను హిమాన్షు ట్విటర్ లో షేర్ చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఫొటో దిగిన సందర్భాన్ని వెల్లడించారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్‌కు అభినందనలు కూడా తెలిపారు. తన ట్వీట్ ను ఆయనకు ట్యాగ్ చేశారు.