Begin typing your search above and press return to search.

హిందూ - ముస్లిం మతాంతర వివాహంపై కోర్టు సంచలన తీర్పు!

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌ కు చెందిన ముస్లిం వ్యక్తి, హిందూ మహిళ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే వారిద్దరూ తమ తమ మతాలను మాత్రం వదులుకోకుండా కలిసి జీవనం సాగించాలని నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   31 May 2024 5:31 AM GMT
హిందూ - ముస్లిం మతాంతర వివాహంపై కోర్టు  సంచలన తీర్పు!
X

ఇటీవల కాలంలో కులాంతర, మతాంతర వివాహాలు పెరుగుతున్నాయని చెబుతున్న సంగతి తెలిసిందే. పైగా ఇది శుభపరిణామం అనేమాటలూ వినిపిస్తుంటాయి. అయితే తాజాగా మతాంతర వివాహంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లద్దని తీర్పునిచ్చింది.

అవును... మతాంతర వివాహం రిజిస్టర్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఓ ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది.. 1954 చట్టం ప్రకారం తమ వివాహం రిజిస్టర్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును కోరింది. ఇలా పోలీస్‌ రక్షణలో ప్రత్యేక వివాహం కోసం ఒక జంట చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌ కు చెందిన ముస్లిం వ్యక్తి, హిందూ మహిళ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే వారిద్దరూ తమ తమ మతాలను మాత్రం వదులుకోకుండా కలిసి జీవనం సాగించాలని నిర్ణయించారు. దీంతో పోలీస్‌ రక్షణ కల్పించడంతోపాటు ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే... ఈ జంట మతాంతర వివాహాన్ని సదరు మహిళ కుటుంబం కోర్టులో వ్యతిరేకించింది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే సమాజంలో తమ పరువుపోతుందని వాపోయింది. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె.. తన వెంట నగలను కూడా తీసుకెళ్లిందని ఆమె కుటుంబం తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మరోవైపు.. వారిరువురూ తమ తమ తమ మతాలు మారలేదని.. సహజీవనం కూడా చేయలేదని.. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం మతాంతర వివాహం చెల్లుబాటు అవుతుందని ఆ జంట తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని ప్రత్యేక వివాహ చట్టం అధిగమిస్తుందని వాదించారు.

ఈ సమయంలో... ఇరు వర్గాల వాదనలు విన్న జస్టీస్ గుర్పాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని ధర్మాసనం... ముస్లిం పురుషుడు, హిందూ మహిళ కలిసి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ.. ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం ఆ పెళ్లి చెల్లదని పేర్కొంది. ఆ జంట పిటిషన్‌ ను తిరస్కరించింది!