Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్ హిస్టరీ... యూఎస్ లో ఈ టర్కీ కోళ్లు ఎంత లక్కీనో!

ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ లో "థాంక్స్ గివింగ్ డే" సందర్భంగా రెండు టర్కీ కోళ్లను క్షమించారు.

By:  Tupaki Desk   |   26 Nov 2024 9:30 PM GMT
ఇంట్రస్టింగ్  హిస్టరీ... యూఎస్  లో ఈ టర్కీ కోళ్లు ఎంత లక్కీనో!
X

ఒక్కసారి కోడి జన్మ ఎత్తిన తర్వాత.. మనిషి బారిన పడితే కూరో, వేపుడో, పకోడో అయిపోవడం కన్ ఫాం అని.. ఏదైనా జంతువు బారిన పడితే లైవ్ లోనే వాటికి ఫుడ్ అయిపోవడం తప్పదనే సంగతి తెలిసిందే! అయితే అమెరికాలోని కొన్ని టర్కీ కోళ్లకు మాత్రం ఆ పరిస్థితి రాదు! ఇవి జీవించినంత కాలం హాయిగా ఉండొచ్చు!

అవును... అమెరికాలో టర్కీ కోళ్లను క్షమించి వదిలేసే పద్ధతి ఒకటుంది. దీన్ని ఆ దేశ అధ్యక్షులు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ లో "థాంక్స్ గివింగ్ డే" సందర్భంగా రెండు టర్కీ కోళ్లను క్షమించారు. వీటి పేర్లు పీచ్, బ్లూసమ్. దీని వెనుక ఓ ఆసక్తికర నేపథ్యం ఉంది.

అమెరికా సివిల్ వార్ సమయంలో అబ్రహాం లింకన్ కుమారుడు టాడ్ ఓ కోరిక కోరాడట. ఇందులో భాగంగా.. జాక్ అనే టర్కీ కోడిని వదిలి పెట్టాలని తండ్రిని అభ్యర్థించారట. అందుకు అబ్రహాం లింకన్ 'సరే' అన్నారని.. ఈ ఘటన 1863లో జరిగిందని చెబుతారు. ఈ విషయాన్ని 1865లో నోహ్ బ్రూక్స్ అనే రిపోర్టర్ బయటపెట్టారు.

దీంతో... నాటి నుంచి వైట్ హౌస్ లో ఈ సంప్రదాయం మొదలైంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న టర్కీ క్షమాపణ కార్యక్రమం మాత్రం 1947లో ట్రూమన్ సమయంలో రూపుదిద్దుకొందనీ చెబుతుంటారు. దీనిని 1989లో జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ అధికారిక సంప్రదాయంగా గుర్తింపునిచ్చారని.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని అంటారు.

ఇందులో భాగంగా... తాను ఈ 'టాం' టర్కీకి హామీ ఇస్తున్నాను.. ఈ కోడి ఎవరి డిన్నర్ టెబుల్ పైనా జీవితాన్ని ముగించనక్కరలేదు.. ఇప్పటి నుంచి దీనికి అధ్యక్షుడి క్షమాభిక్ష లభించింది.. ఫలితంగా జీవితాన్ని ఫామ్మ్ లోనే గడపొచ్చు అని నాడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ పేర్కొన్నారని అంటారు.

దీంతో... నాటి నుంచి అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రతీ అధ్యక్షుడు ఏటా ఒకటి లేదా రెండు కోళ్లకు ఇలా క్షమాభిక్ష ప్రసాదీస్తారు. ఈ నేపథ్యంలో బైడెన్ గత ఏడాది బెల్, లిబర్టీ అనే వాటికి క్షమాభిక్ష ప్రసాదించగా.. తాజాగా పీచ్, బ్లూసమ్ అనే టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాధించారు!