Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన ఫోటో చరిత్ర, ధర తెలుసా?

మరికొంతమంది ల్యాప్ టాప్, డెస్క్ టాప్, మొబైల్ ఫోన్స్ పై వాల్ పేపర్స్ గా పెట్టుకుంటారు. మరికొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ వాల్స్ పైనా, డీపీగానూ పెట్టుకుంటారు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 10:30 PM GMT
ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన  ఫోటో చరిత్ర, ధర తెలుసా?
X

చాలా మందికి ఫోటోలు దిగడం అంటే పిచ్చి ఇష్టం. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత ఈ ఇష్టం మరింత పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక మరికొంతమందికి ఫోటోలు దిగడం అంటే కాస్త బెరుకు. అయితే.. ఈ రెండు కేటగిరీలకు చెందినవారూ ఫోటోలు తీయడానికి మాత్ర గరిష్టంగా ఇష్టం చూపిస్తుంటారని అంటారు.

ఇక అప్పుడుడప్పుడూ సెర్చ్ లో కనిపించి కొన్ని ప్రకృతికి సంబంధించిన ఫోటోలు, ప్రపంచంలోని పరిస్థితులకు అద్దం పట్టే ఫోటోలు తీవ్ర ఆసక్తిని కనబరుస్తాయనేది తెలిసిన విషయమే. దీంతో.. వాటిలో కొన్నింటిని డౌన్ లోడ్ చేయించుకుని.. ప్రింట్ తీయించుకుని.. ఫ్రేమ్ కట్టి, ఫోస్టర్స్ గా ఇంట్లో గోడలపై అమర్చుతారు.

మరికొంతమంది ల్యాప్ టాప్, డెస్క్ టాప్, మొబైల్ ఫోన్స్ పై వాల్ పేపర్స్ గా పెట్టుకుంటారు. మరికొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ వాల్స్ పైనా, డీపీగానూ పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన ఫోటోగా చరిత్ర సృష్టించిన ఫోటో గురించి.. దాని చరిత్ర గురించి తెలుసుకుందా.. అదే విడోస్ డీఫాల్ట్ వాల్ పేపర్.

అవును... మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్.పి. ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్) వాడినివారికి పచ్చిక బయళ్లతో నిండిన భూమి, తెల్లని మేఘాలతో ఉన్న అకాశం ఒకే ఫ్రేం లో అత్యంత అందంగా కనిపించే వాల్ పేపర్ గురించి తెలిసిందే. ఈ వాల్ పేపర్ "బ్లిస్" ను దాదాపు నాటి యూజర్స్ గరిష్టంగా ఉపయోగించే ఉంటారు.

ఈ ఫోటోను 1996లో చార్లెస్ ఓ రియర్ అనే వ్యక్తి తీశారు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ ఈ ఫోటో హక్కుల్ని కొనుగోలు చేసింది. దీనికోసం 1,00,000 డాలర్ లకు పైగా చార్లెస్ కు చెల్లించినట్లు చెబుతారు. ఈ ఫోటోను ఇప్పటివరకూ కొన్ని బిలియన్ల మంది చూసి ఉంటారని అంచనా.

దీంతో... ఈ ఫోటో ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికులు వీక్షించిన ఫోటోగా గుర్తింపు దక్కించుకుంది! ఇదే సమయంలో... పీటర్ బురియన్ తీసిన శరదృతువు (ఆటమన్) వాల్ పేపర్ ను కూడా మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. దీన్ని 45 డాలర్లకే కొనుగోలు చేసినట్లు చెబుతారు.