Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో సెట్టింగ్.. హైదరాబాద్ లో హైటెక్ ముఠా గుట్టు రట్టు

ఆన్ లైన్ ప్లాట్ ఫాం వేదికగా కస్టమర్లను సంప్రదించటం.. వారు కోరుకున్నట్లుగా కస్టమర్ డేటా బేస్ ను సిద్ధం చేయటం

By:  Tupaki Desk   |   14 Jun 2024 10:30 AM GMT
ఆన్ లైన్ లో సెట్టింగ్.. హైదరాబాద్ లో హైటెక్ ముఠా గుట్టు రట్టు
X

హైదరాబాద్ మహానగరంలో పోలీసులు ఒక హైటెక్ వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. వ్యభిచార ముఠాను పట్టుకోవటం.. వాటి గుట్టు రట్టు చేయటం మామూలే అయినా.. తాజాగా పట్టుకున్న రాకెట్ మొత్తం హైటెక్ వ్యవహారంలో ఉండటంతో పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఆన్ లైన్ ప్లాట్ ఫాం వేదికగా కస్టమర్లను సంప్రదించటం.. వారు కోరుకున్నట్లుగా కస్టమర్ డేటా బేస్ ను సిద్ధం చేయటం.. వారు ఎంపిక చేసుకున్న మహిళల్ని.. వారు కోరుకున్న చోట కలుసుకునేలా చేయటం.. వారి రేంజ్ కు తగ్గట్లు లాడ్జిలను బుక్ చేయటం లాంటివి చేస్తుంటారు.

ఈ రాకెట్ కు సంబంధించి పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్కు హోటల్ లోని ఒక గదిపై దాడి చేశారు. బాధితురాలితో పాటు నిందితుడ్ని అదుపులోకి తీసుకన్నారు. వీరి నుంచి సేకరించిన సమాచారంతో బాధితులు ఉన్న వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు ప్రదేశాల్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్ ను బద్ధలు చేశారు.

ఈ రాకెట్ లో భాగస్వాములైన ప్రధాన నిర్వాహకుల్ని.. వారి ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నగదు.. రెండు కార్లు.. రెండు టూ వీలర్లతో పాటు పద్దెనిమిది సెల్ ఫోన్లు.. పెద్ద ఎత్తున వివిధ బ్యాంకుల డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో హైటెక్ పద్దతిలో సాగుతున్న ఈ దందా గుట్టు రట్టు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.