Begin typing your search above and press return to search.

ఈ చైనా ఉందే...భూగోళాన్నే వణికిస్తోందిగా !

తాను ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలని చైనా ఎపుడూ తపిస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   5 Jan 2025 3:23 AM GMT
ఈ చైనా ఉందే...భూగోళాన్నే వణికిస్తోందిగా !
X

చైనా అంటేనే ఇపుడు హడల్ అనుకునే పరిస్థితి వస్తోంది. ఒక విధంగా చైనా అదే కోరుకుంటోందా అన్న చర్చ కూడా ఉంది. తాను ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలని చైనా ఎపుడూ తపిస్తూ ఉంటుంది. తాను ప్రపంచాన్ని వణికించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది.

ఇపుడు వైరస్ ల రూపంలో చైనా అదే పనిని చేస్తోంది. ఈ విషయంలో చైన సూపర్ సక్సెస్ అవుతోంది అని అంటున్నారు. సరిగ్గా అయిదేళ్ళ క్రితం కరోనా వైరస్ ని ప్రపంచానికి పరిచయం చేసింది చైనా. ఈ వైరం పుణ్యమాని లక్షలలో జనాలు చనిపోయారు.

భూగోళం మొత్తం గిర గిరా తిరిగింది. ఎంతటి వారు అయినా కనిపించని కరోనా వైరస్ కి భయపడి దాగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్ధికంగా సంపన్న దేశాలు సైతం దెబ్బ తిన్నాయి. సుమారుగా రెండేళ్ళ పాటు ప్రపంచం ఎక్కడికీ కదలని పరిస్థితి ఉంది.

ఇపుడు చూస్తే 2025 నెల, సరిగ్గా మళ్లీ అదే రూపంలో అవే లక్షణాలతో వైరస్ చైనాలో వీర విహారం చేస్తోంది అన్న చేదు వార్తలు ప్రపంచాన్ని భయం గుప్పిట ఉంచుతున్నాయి. ఇక్కడ మరో యాంటీ సెంటిమెంట్ ని కూడా అంతా గుర్తు చేస్తున్నారు.

ఆనాడూ జనవరి ఫస్ట్ బుధవారం వచ్చిందని ఈనాడూ బుధవారం వచ్చిందని అపుడూ కొత్త ఏడాది మొదట్లోనే చైనాలో కరోనా దూకుడు చేసి తరువాత ప్రపంచానికి పాకిందని ఇపుడు కూడా సరిగ్గా అలాగే జరుగుతుందా అన్న చర్చ సాగుతోంది.

చైనా ఎపుడూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పదు. అదే ప్రపంచానికి కూడా పట్టుకున్న అతి పెద్ద అనుమానం. చైనాలో ఇపుడు విజృంభిస్తున్న వైరస్ మామూలే అని ఆ దేశం అంటోంది. శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు లాంటిదే అని అంటోంది. కానీ దీనిని నమ్మితే మాత్రం కరోనా తరహాలో లోకాన్ని చుట్టేస్తుందని దెబ్బైపోతామని ప్రపంచ దేశాలు అంటున్నాయి.

అందువల్ల ఇప్పటి నుంచే అలెర్ట్ కావాలని కరోనా గుణ పాఠాలను సీరియస్ గా తీసుకున్న వారూంతా అంటున్నారు. ఇక చైనాలో వైరస్ ధాటికి చాలా మంది శ్వాస ఆడక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇది కరోనాకు అమ్మ మొగుడులా ఉందని కూడా అంటున్నారు.

ఈ వైరస్ కి కూడా వ్యాక్సిన్ అయితే లేదు. కరోనా వ్యాక్సిన్ నే దీనిని వాడాలని అంటున్నారు. చైనాలో వేగంగా వ్యాపిస్తున్న దాని పేరు హెచ్ఎంపీవీ వైరస్. దీనిని ఏ మందులూ లేవని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మార్గమని అంటున్నారు. ఇకపోతే ఈ వైరస్ తో పాటు మరో మూడు వైరస్ లు కూడా చైనాలో చాలా చురుకుగా ఉన్నాయని అంటున్నారు. దాంతో చైనా వైరస్ లకు పుట్టిల్లుగా మారిందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఈ వైరస్ ల నుంచి కాపాడుకోవడం ఎలా అన్న దాని మీదనే ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. చైనా బయటకు చెప్పడం లేదు కానీ అక్కడ ఆసుపత్రులు అన్నీ కిటకిటలాడుతున్నాయి. అదే సమయంలో మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయీ అంటే హెచ్ఎంపీవీ వైరస్ తీవ్ర ప్రభావమే చూపిస్తోంది అని అంటున్నారు.

ఇక చైనా భారత్ కి పొరుగు దేశంగా ఉంది. దాంతో భారత్ కూడా ఫుల్ అలెర్ట్ అయింది. తగిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. చైనాకు పొరుగున ఉన్న జపాన్ లోని హాంకాంగ్ కి హెచ్ఎంపీవీ వైరస్ పాకడంతో భారత్ ఇక ఎమెర్జెన్సీ మోడ్ లో పనిచేయాల్సిందే అని అంటున్నారు. ఏది ఏమైనా 2025 వస్తూనే ఇలా వైరస్ వార్తను ప్రపంచానికి మోసుకు రావడం బ్యాడ్ గానే అంతా చూస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రమాదం నుంచి బయటపడాలని అన్ని దేశాలూ కోరుకుంటున్నాయి