ఫేమస్ "పిచ్చి"!... హోలీ పేరుతో వీరి విన్యాసాలు చూశారా?
అసలు హిందూ పురాణాల ప్రకారం పండుగలు ఎందుకు అంత ప్రముఖంగా ప్రస్తావించారనేది చాలా మందికి తెలియదు
By: Tupaki Desk | 25 March 2024 10:48 AM GMTఅసలు హిందూ పురాణాల ప్రకారం పండుగలు ఎందుకు అంత ప్రముఖంగా ప్రస్తావించారనేది చాలా మందికి తెలియదు. అది ఒక సెలవు రోజని కొంతమంది అనుకుంటే.. వికృత చేష్టలకు అనుమతి దొరికిన రోజన్నట్లుగా మరికొంతమంది వ్యవహరిస్తుంటారనే కామెంట్స్ అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా హోలీ రోజున ఇద్దరు అమ్మాయిలు బైక్ పై చేసిన చేష్టలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కాగా.. కామెంట్స్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంటున్నాయి!
గజగజా వణికించిన చలికి బై బై చెబుతూ.. వేసవి వెచ్చదనానికి స్వాగతం చెబుతున్న వేళ ప్రకృతిలో సరికొత్త సొగసు కనువిందు చేసే వసంత రుతువు ఆగమనానికి గుర్తింపుగా హోలీ పండుగను జరుపుకుంటారు! ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు సరికొత్తగా చిగురిస్తూ.. ప్రకృతికి కొత్త కళ తెస్తూ, మనుషుల్లో సరికొత్త ఉత్సాహం నింపడానికి హోలీని చేసుకుంటారు! అయితే... ఈ పండుగ పేరు చెప్పి రంగులు చల్లుకుంటూ కొంతమంది శృతితప్పి చేసే పనులు విచిత్రంగా ఉంటాయి.
పైగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా యుగం కావడంతో అతితక్కువ సమయంలోనే ఫేమస్ అయిపోవాలని కోరుకునే బ్యాచ్ ఎక్కువైపోయారనే చర్చ జరుగుతుంది! దానికోసం ఆన్ లైన్ వేదికగా వారు చేసే ప్రయత్నాలు కొన్ని సార్లు నవ్వు తెప్పించగా, మరికొన్ని సార్లు అభినందించాలనిపించేలా ఉండగా, ఇంకొన్నిసార్లు మాత్రం జుగుప్స కలిగించేవిగా ఉంటాయి! ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ మూడింటిలో ఏ కోవకు చెందేది అనేది పాఠకుల ఇష్టం!
వివరాళ్లోకి వెళ్తే... తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... ఒక స్కూటర్ పై ముగ్గురు వెళ్తున్నారు. వీరిలో అబ్బాయి స్కూటీ నడుపుతుండగా.. వెనుక ఇద్దరమ్మాయిలు ఎదురెదురుగా కుర్చున్నారు. ఈ సందర్భంగా రంగులుతో నిండిన వారిద్దరూ వెనక కూర్చుని.. డ్యాన్స్ చేస్తున్నారా.. రొమాన్స్ చేస్తున్నారా.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా అనేది పాఠకులే నిర్ధారించుకోవాలి!
దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా.. పండుగల అర్ధం తెలియని అజ్ఞానులు అని కొందరంటే.. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇదే సమయంలో ఫేమస్ అవ్వాలనే ప్రయత్నంలో ఏమి చేస్తున్నారనే విషయం మరిచిపోతున్నారని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు.
కాగా... ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీ మెట్రో ట్రైన్ లో హోలీ వేడుకలను జరుపుకుంటూ రాం లీలాలోని అంగ్ లగా దే పాటకు చేసిన పనులు ఇప్పటికే వైరల్ అవ్వగా... ఇది మెట్రో స్టేషనా లేక మరేదైనా స్టేషనా అంటూ పలువురు కామెంట్ చేయగా... మెట్రోలో ఇలాంటి పనులు చేసేవారికి సెకనుకు ఇంత అని ఛార్జ్ చేసే తిక్కకుదురుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ రెండు వీడియోలూ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.