Begin typing your search above and press return to search.

ఒక్క రెజ్యూమ్ ఆ కుక్ జీవితాన్నే మార్చేసింది..!

ఉర్వి అనే మహిళ చేసిన ఎక్స్‌పెరిమెంట్‌కు నెట్టింటా ఓ వ్యక్తి నుంచి ఊహించని రిప్లై లభించింది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 7:02 AM GMT
ఒక్క రెజ్యూమ్ ఆ కుక్ జీవితాన్నే మార్చేసింది..!
X

దేశానికి బెంగళూరు ఓ పిల్లర్ అనే చెప్పాలి. దేశాభివృద్ధిలో కానీ.. సాఫ్ట్‌వేర్ రంగంలో నైపుణ్యతలకు కానీ.. బెంగళూరు కేరాఫ్‌గా నిలుస్తోంది. అందుకే నిత్యం అక్కడికి వలసలు సైతం పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు అక్కడికి చేరుకుంటున్నారు. అంతేకాదు.. ఇక్కడి నగర వాసులు టెక్నాలజీ వినియోగంలోనూ చాలా ముందుంటారు.

ఎన్నో ప్రయోగాలు, ఎన్నో స్టార్టప్‌లు ఇక్కడే ప్రాణం పోసుకున్నాయి. తాజాగా.. ఓ మహిళ క్రియేటివ్‌ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింటా వైరల్ అయింది. ఉర్వి అనే మహిళ చేసిన ఎక్స్‌పెరిమెంట్‌కు నెట్టింటా ఓ వ్యక్తి నుంచి ఊహించని రిప్లై లభించింది.

హెచ్ఎస్ఆర్ ఏరియాలో సింపుల్ హోమ్‌లీ ఫుడ్ తయారు చేసే కుక్ కోసం సిఫార్లు చేయాలని ఉర్వి ఎక్స్‌లో కోరారు. దయచేసి లీడ్స్ ఉంటే చెప్పాలంటూ అభ్యర్థించారు. వరుణ్‌పెరూ అనే వ్యక్తి ఆమె క్విశ్చన్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. దాంతో ఆ ఆన్సర్ కాస్త సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. తన వంటమనిషి రీతు సీవీ (బయోడేటా) ని ఉర్వికి షేర్ చేశారు. ఆమెను కుక్ ఉద్యోగం కోసం తీసుకోండని కోరారు. ఇంటి భోజనం తయారీలో ఆమె పని అద్భుతంగా ఉంటుందని, ఆమె కోసం రెజ్యూమ్‌ను కూడా తయారు చేశానని వెల్లడించారు. రెజ్యూమ్‌తో సహా ఉర్వి పోస్టుకు రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

ఆ రెజ్యూమ్‌లో రీతూ నైపుణ్యాలు, వాటి వివరాలను జతచేశారు. రాజ్మా-చావల్, రసం రైస్ చేయడంలో ఆమె నిపుణురాలని పేర్కొన్నారు. వంటగదిని సైతం పరిశుభ్రంగా ఉంచుతుందని తెలిపారు. గ్యాస్, ఇండక్షన్ స్టవ్ ఉపయోగించి వంట చేయడంలో ఆమెకు ఆమె సాటి అని కొనియాడారు. మీరు కోరుకున్నట్లుగా రీతూ సరిగా సరిపోతుందని రిప్లై ఇచ్చాడు. అయితే.. ఓ వంట మనిషి కోసం సీవీ తయారు చేసి పోస్టు చేయడం నెట్టింటా తెగ వైరల్ అయింది. ఓ కుక్ కోసం ఇలా రెజ్యూమ్ తయారు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.