Begin typing your search above and press return to search.

హోంమంత్రి అనిత షాకింగ్ డెసిషన్ పీఏ పై వేటు

పదేళ్లుగా తన పీఏగా పనిచేస్తూ రాజ్యాంగేతర శక్తిగా ముద్రపడిన వ్యక్తిని ఎట్టకేలకు వదిలించుకుంటూ నిర్ణయం మంత్రి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2025 6:27 AM GMT
హోంమంత్రి అనిత షాకింగ్ డెసిషన్ పీఏ పై వేటు
X

హోంమంత్రి అనిత తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పదేళ్లుగా తన పీఏగా పనిచేస్తూ రాజ్యాంగేతర శక్తిగా ముద్రపడిన వ్యక్తిని ఎట్టకేలకు వదిలించుకుంటూ నిర్ణయం మంత్రి తీసుకున్నారు. మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేటతోపాటు హోంశాఖలో దందాలు చేస్తున్నట్లు మంత్రి పీఏపై ఆరోపణలు ఉన్నాయి. ఏడు నెలలుగా ఆయన ప్రవర్తన మితిమీరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా ఇన్నాళ్లు మంత్రి పట్టించుకోలేదు. దీంతో పీఏ దందాల్లో మంత్రి పాత్రపైనా విమర్శలు వచ్చాయి. దీంతో తనతోపాటు పార్టీకి చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన హోంమంత్రి ఎట్టకేలకు తన పీఏను తప్పించారు.

ఎమ్మెల్యేగా, టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన హోంమంత్రి అనిత వద్ద పదేళ్లుగా మంత్రి అనిత వద్ద పీఏగా పనిచేస్తున్న జగదీష్ పై ఇటీవల కాలంలో చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి. అనిత పదవిలో ఉన్నా, లేకపోయినా ఆమె రాజకీయ వ్యవహారాలన్నీపీఏ చూసేవాడు. దీంతో హోంమంత్రి అయిన తర్వాత కూడా పీఏగా నే కొనసాగించారు మంత్రి. అయితే తమ మేడమ్ మంత్రి కావడంతో పీఏ అరాచకాలకు తెరతీశాడు అని ప్రధాన ఆరోపణ . హోంమంత్రికి తెలియకుండా దందాలు చేయడం మొదలుపెట్టాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ వసూళ్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో చలరేగిపోయాడు అని ప్రతి పక్ష పార్టీ వాదన. ఇక మంత్రి సొంత నియోజకవర్గంలో అతడి అరాచకాలు మరింత శ్రుతిమించాయని చెబుతున్నారు.

పాయకరావుపేటలో పేకాట శిబిరాల నిర్వహణ, మద్యం షాపుల్లో వచ్చే ఆదాయంలో వాటా కోసం ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, తిరుమల దర్శనం టికెట్లు అమ్ముకోవడం ఇలా పీఎ పాపాల లిస్టు చాలా సంపాదించిన తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. మంత్రి పీఏ అరాచకాలు భరించలేకపోతున్నామని, ప్రత్యేక సమావేశం నిర్వహించి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కూడా బెదిరించాడు. దీనంతటికి మంత్రి వత్తాసుపలుకుతున్నారని, స్థానిక నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు పంపడంతో మంత్రి ఎట్టకేలకు పీఏపై వేటు వేయాల్సివచ్చిందంటున్నారు.