Begin typing your search above and press return to search.

ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ చేసిన మహీంద్రా?... హోంమంత్రి కీలక వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు కీలక విషయలు తెరపైకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 July 2024 10:06 AM GMT
ఏపీ పోలీస్  శాఖను బ్లాక్  చేసిన మహీంద్రా?... హోంమంత్రి కీలక వ్యాఖ్యలు!
X

ఏపీలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అక్రమాలు, దారుణాలను, పరిపాలనలో లోపాలనూ కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చి ఎండగడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు కీలక విషయలు తెరపైకి వస్తున్నాయి.

గతంలో వైసీపీ ప్రభుత్వం తమ హయాంలో టీడీపీ, జనసేన కార్యకర్తలను అణిచివేసేందుకు పోలీసు శాఖను దుర్వినియోగం చేసిందని ఆ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు టోపీపై ఉన్న మూడు సింహాలకు అర్ధం ఏమిటో తెలుసా.. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడానికి కాదు, ప్రాజాస్వామ్యాని కాపాడటానికి అని జగన్ క్లాసులు పీకుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు శాసన సభలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను పలు అంతర్గత లోపాలు వెంటాడాయని చెబుతూ... గతంలో మహీందర కంపెనీ ఏపీ పోలీసు శాఖను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని, కోర్టులో కేసు వేసిందని పేర్కొనడం గమనార్హం.

అవును... గత వైసీపీ ప్రభుత్వం ఏపీ పోలీసు శాఖ కోసం మహీంద్రా కంపెనీ నుంచి వాహనాలను కొనుగోలు చేసిందని.. అయితే వాటికి సంబంధించి 2021 సమయంలో సుమారు 17కోట్ల రూపాయలు పెట్టి పోలీసు శాఖకు వాహనాలు అయితే కొన్నారు అని చెప్పిన అనిత.. వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం చెల్లించలేదని వెల్లడించారు.

దీంతో... మహీంద్రా కంపెనీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ విషయం కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.13 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.