Begin typing your search above and press return to search.

హానీ ట్రాప్ లో జైలుకెళ్లి..బెయిల్ పై వచ్చి చేసిన పని తెలిస్తే అవాక్కే!

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఒడిశా హైప్రొఫైల్ హనీట్రాప్ కేసు గుర్తుందా? తన భర్తతో కలిసి అర్చనా నాగ్ అనే మహిళ చేసిన ఘనకార్యాలు అప్పట్లో ప్రముఖంగా వెల్లడయ్యాయి.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:51 AM GMT
హానీ ట్రాప్ లో జైలుకెళ్లి..బెయిల్ పై వచ్చి చేసిన పని తెలిస్తే అవాక్కే!
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఒడిశా హైప్రొఫైల్ హనీట్రాప్ కేసు గుర్తుందా? తన భర్తతో కలిసి అర్చనా నాగ్ అనే మహిళ చేసిన ఘనకార్యాలు అప్పట్లో ప్రముఖంగా వెల్లడయ్యాయి. ఆమెను అరెస్టుచేసిన పోలీసులు జైలుకు పంపారు. అలా పద్నాలుగు నెలలుగా జైల్లో ఉన్న ఆమెకు తాజాగా బెయిల్ మంజూరైంది. జైలు నుంచి బయటకు వచ్చింతనే ఆమె చేసిన పని ఇప్పుడు మరోసారి అందరిని ఆకర్షిస్తోంది.

అర్చనపై నమోదైన ఈడీ కేసుకు సంబంధించి ఆమెకు ఈ నెల 5న బెయిల్ మంజూరైంది. దీంతో జైలు నుంచి బయటకువచ్చే మార్గం సుగమమైంది. అదే సమయంలో భువనేశ్వర్ నగర పోలీసులు ఆమెపై పెట్టిన రెండు కేసులకు సంబంధించి బెయిల్ మంజూరైంది. రూ.2 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన వేళలో ఎలాంటి నేరం చేయకూడదని.. పాస్ పోర్టును కోర్టులో డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది. అవసరమైతే కోర్టు ఎదుట హాజరు కావాలని చెప్పింది. తాను రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎక్కడకు వెళ్లనని.. చివరి వరకు పోరాటం చేస్తానన్న ఆమె.. బెయిల్ మీద జైలు నుంచి బయటకు రాగానే లా పరీక్ష కోసం ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లటం ఆసక్తికరంగా మారింది.

జైల్లో ఉన్నప్పుడు లా డిగ్రీ కోసం ఆమె అప్లై చేయటం.. న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు.పరీక్షల కోసంఆమెకు బెయిల్ మంజూరైనట్లుగా చెబుతున్నారు. హనీట్రాప్ తో పాటు మరో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆర్చన భర్త అనంత నాగ్ 2022లో అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక.. ఆర్చన హనీట్రాప్ విషయానికి వస్తే.. ఒక సినీ నిర్మాత తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళ ఫిర్యాదు చేయటం.. ఆ సందర్భంగా నిర్మాతతో పాటు ఆ మహిళ అసభ్యంగా ఉన్న ఫోటోలువైరల్ అయ్యాయి.

అయితే.. ఆ మహిళ.. ఆర్చన నాగ్ తన నుంచి రూ.3కోట్లు దోపిడీ చేశారంటూ సదరు నిర్మాత ఫిర్యాదు చేశాడు. హనీట్రాప్ లో తనను ఇరికించినట్లుగా సదరు నిర్మాత వాపోయి.. అందుకు సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టటంతో ఆర్చనా నాగ్ ఉదంతం బయటకు వచ్చి సంచలనమైంది. ఆమె బాధితులు బోలెడంత మంది ఉన్నారని.. వారిలో పలువురు అత్యంత కీలకస్థానాల్లో ఉన్న వారు కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు.