Begin typing your search above and press return to search.

మళ్లీ రెచ్చిపోయిన రెబల్స్‌... ఎవరీ హౌతీలు?

అవును... ఇజ్రాయేల్ – హమస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు

By:  Tupaki Desk   |   25 Dec 2023 6:35 AM GMT
మళ్లీ రెచ్చిపోయిన రెబల్స్‌... ఎవరీ హౌతీలు?
X

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఊహించని సమస్య ప్రపంచ దేశాలకు వచ్చింది. ఇందులో భాగంగా ఎర్రసముద్రం ద్వారా నౌకా ప్రయాణం ఇబ్బందులో పడుతుంది. హౌతీలు చేస్తున్న డాడుల వల్ల ప్రపంచ నౌకా రవాణా రంగం ఇబ్బందులు పడుతుంది. ఫలితంగా... ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో హౌతీలో మరోసారి రెచ్చిపోయారు. దీంతో ఎర్రసముద్రంలోని ప్రయాణం మసకబారుతుంది!

అవును... ఇజ్రాయేల్ – హమస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. భారత్‌ కు ప్రయాణిస్తున్న ఎం.వి.సాయిబాబా వాణిజ్య చమురు ట్యాంకర్‌ పై డ్రోన్‌ దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో నౌకలో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని తెలుస్తుంది. అయితే... వారిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించారు.

అయితే ఈ ఈ నౌకను తొలుత భారత్‌ కు చెందినదిగా అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. అయితే అది భారత్‌ ది కాదని.. గబాన్‌ దేశానికి చెందినదని మన అధికారులు వెల్లడించారు. అది షిప్పింగ్‌ కోసం భారత్‌ లో రిజిస్టరు చేసుకుందని వివరించారు. ఈ నేపథ్యంలో... ఎర్రసముద్రం గుండా నౌయా ప్రయాణాన్ని పలు కంపెనీలు సైడ్ చేస్తున్నాయి. ప్రత్యామ్న్యాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తున్నాయి!

ఎర్ర సముద్రంలోని నౌకలపై హౌతీ చేస్తున్న దాడులతో బెంబేలెత్తిపోయిన షిప్పింగ్‌ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఈ సమయంలో... బాబ్‌ ఎల్‌ మండెప్‌ మార్గంలో నౌకలను తిప్పబోమని ప్రకటించాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎర్ర సముద్రం మీదుగా 35 శాతం రవాణాను ఆపేశాయి. మార్స్క్‌, హపాగ్‌ లాయిడ్‌, ఎంఎస్‌సీ కంపెనీలు రవాణాను నిలిపేశాయి.

భారత్‌ పై ప్రభావం!:

ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరోపాకు నౌకల ద్వారానే భారత్‌ సరకు రవాణా చేస్తోంది. దీనికోసం ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటోంది. పైగా అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా 12 శాతం మంది భారతీయులే ఉంటారు. ఈ సమయంలో తాజాగా ఇజ్రాయేల్ – హమాస్ యుద్ధం నేపథ్యంలో వారికి హౌతీ రెబల్స్‌ ప్రమాదకరంగా మారారు.

ఎవరీ హౌతీలు?:

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌ ల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ... జైదీ షియాలు, హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో 1990లో ఏర్పడిన గ్రూపే హౌతీ గ్రూప్! ఈ గ్రూపుకు పశ్చిమ యెమెన్‌ కేంద్రంగా ఉంది. ఈ హౌతీ రెబల్స్‌ కు ఇరాన్‌ నుంచి భారీగా ఆయుధాలు, డబ్బు సమకూరుతున్నాయి. అందులో ప్రధానంగా డ్రోన్లు, యాంటీ షిప్‌, బాలిస్టిక్‌ క్షిపణులు ఉంటున్నాయి!

ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్‌ మాలిక్‌ అల్‌ హౌతీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రధానంగా ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్‌ ఎల్‌ మండెప్‌ పై హౌతీ రెబల్స్‌ కు ఆధిపత్యం ఉంది. ఇప్పుడు అదే ప్రపంచ దేశాలకు పెద్ద సమస్యగా మారుతుంది. 2014 నుంచి యెమెన్‌ లోని సైనిక ప్రభుత్వంతో ఈ గ్రూపు పోరాడుతూనే ఉంది.

ఈ పోరాటంలో ఇప్పటిదాకా సుమారు 3,77,000 మంది మరణించగా.. 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తుంది.