హాట్ టాపిక్... జూనియర్ ఎన్టీఆర్ ముందు బాలకృష్ణ ఎంత?
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య హుకుం జారీచేసి విషయానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి!
By: Tupaki Desk | 18 Jan 2024 12:06 PM GMTతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా.. ఆయన ఘాట్ వద్ద జరిగిన దారుణ సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య హుకుం జారీచేసి విషయానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి!
అటు తెలుగుదేశం పార్టీ బహిరంగ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన ఫోటోలు చేతపట్టి, జై ఎన్టీఆర్ అనే నినాదాలు చేస్తే వారిని పక్కకు లాగేయమని స్వయంగా పార్టీ అధినేత చెబుతున్న పరిస్థితి. మరోపక్క తన తాత వర్ధంతిరోజు అభిమానులు ఏర్పాటుచేసుకున్న ఫ్లెక్సీలపై కూడా బాలయ్య పడటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
అవును... సీనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలయ్య హుకుం జారీచేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఏ రకంగా చూసినా జూనియర్ కు బాలయ్య పోటీకాదని, సాటి రారని చెబుతున్నారు. స్వయంగా నందమూరి తారాకరామారావు రూపం పునికిపుచ్చుకుని.. అన్నగారి అసలు సిసలు వారసుడిగా జన్మించిన తారక్ ముందు బాలయ్య ఎంత అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా తారక్ డైలాగ్ డెలివరీ, డైలాగ్ డిక్షన్ తో బాలయ్య పోటీపడలేరనీ.. తారక్ రియల్ స్టార్ అని.. ప్రతీ మహిళను "అమ్మా"అని సంభోదించే సంస్కారవంతుడని.. పెద్దలు గౌరవించడం, పిన్నలను ప్రేమించడం, తోటివారితో కలిసిపోవడం జూనియర్ లక్షణాలని.. అహం, అహంకారం తన ఇంటి ప్రహారీని కూడా తాకనివ్వని లక్షణాలు కలిగిన “మనీషి” అని అంటున్నారు అభిమానులు.
ఎన్ని అవమానాలు పడుతున్నా.. కుటుంబంలో ఎంత వివక్షను ఎదుర్కొంటున్నా.. పెద్దాయనలో ఉన్నంత సహనం ఈ చిన్న వయసులోనే ఉండటం వల్ల తాను రోడ్లపైకి వచ్చి పిల్ల చేష్టలు చేయడం లేదని.. తన వయసుకు మించిన హుందాతనంతో నడుచుకుంటున్నాడని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. వయసు వస్తేనే సంస్కారం రావాలని రూలేమీ లేదని.. అలా రానివారు కోకొక్కలుగా ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు.
అసలాయన సహనంగా ఉంటున్నారు కాబట్టే కొసరోళ్లు అంతా హ్యాపీగా బండి నడిపేస్తున్నారని.. జూనియర్ ఒక్కసారి ఎదురు తిరిగితే ఆయన అభిమానులు, అన్నగారి అసలు సిసలు అభిమానులు ఎవరూ బాలయ్య వెంట నడవరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిప్పులు కక్కడానికి గల కారణం ఈరోజు జరిగిన సంఘటన ఒక్కటే కాదనేది తెలిసిన విషయమే.
గతకొంతకాలంగా సినిమాల్లో ఎన్టీఆర్ ఎదుగుదల చూసి ఓర్వలేకో.. అతడు పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తే తమ అడ్రస్ లు శంకరగిరి మాన్యాలే అనే ఆందోళనతోనో ఏమో కానీ... తారక్ ను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు పెడుతున్నారు కుటుంబ సభ్యులు అని చెప్పుకునే జనాలు! ఇందులో భాగంగానే హర్ట్ అయిన కొంతమంది ఫ్యాన్స్ గతంలో... "అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే" అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. అయితే... ఆ కొసరోడికి ఈ పండగ ఎల్లప్పుడూ ఉండాలంటే జూనియర్ ని వేధించాలని భావిస్తున్నట్లుగా ఉన్నారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.