Begin typing your search above and press return to search.

బాబును అంత బాగా నమ్ముతున్నారా ?

అదే ఆయన అనుభవం, విజన్, పరిపాలనా దక్షత. బాబు అంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్న భావన అయితే అందరిలోనూ ఉంది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 10:30 AM GMT
బాబును అంత బాగా నమ్ముతున్నారా ?
X

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ ప్రజలు బాగా నమ్ముతున్నారు అనడానికి ఇది ఒక అచ్చమైన ఉదాహరణ. బాబు విషయంలో ఎన్ని విమర్శలు అయినా ఉండవచ్చు. ఆయన రాజకీయాలు చేస్తారని కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం ఆయనను ఇవన్నీ పక్కన నెట్టేసి కాపాడుతున్నాయి.

అదే ఆయన అనుభవం, విజన్, పరిపాలనా దక్షత. బాబు అంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్న భావన అయితే అందరిలోనూ ఉంది. ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో కూడా మంచి పాలనాదక్షులు అన్న దగ్గవారు తక్కువ మందే ఉన్నారు. కాంగ్రెస్ సీఎంలలో జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి అంతకు ముందు నీలం సంజీవరెడ్డి ఆ విధంగా ఖ్యాతిని సంపాదించుకున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయ్యాక గత నలభై ఏళ్ళలో బెస్ట్ సీఎంల లిస్ట్ తీస్తే బాబుదే అగ్ర తాంబూలం అని చెబుతారు. ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ఆయనకు పాలన మీద ఉన్న పట్టు కానీ ఆయన విజన్ కానీ అంతా మెచ్చుకుంటారు.

ఇదిలా ఉంటే వంద రోజుల బాబు పాలన మీద సర్వేలు వస్తున్నాయి. ఆయన పాలన మీద అసంతృప్తి ఉందని అంటున్న వారూ ఉన్నారు. అయితే బాబు మీద జనాలకు నమ్మకం ఏ స్థాయిలో ఉందో చెప్పే పారా మీటర్ లాంటి ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. చంద్రబాబు ఏపీలో వరద సాయం కోసం ఇచ్చిన ఒకే ఒక్క పిలుపునకు స్పందించి యావత్తు ప్రజానీకం పోటీలు పడి మరీ ఆయనకు విరాళాలు వెల్లువలా ఇచ్చేశారు.

వాటి విలువ చూస్తే అక్షరాలా నాలుగు వందల కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తం అది కూడా వెరీ షార్ట్ పీరియడ్ లో పూలప్ కావడం అంటే ఇది చిన్న విషయం కానే కాదు, చంద్రబాబుకు ఇస్తే కనుక ఆయన కచ్చితంగా ప్రతీ పైసా సక్రమంగా వెచ్చిస్తారని దాని వల్ల ఉపయోగం జరుగుతుందని భావించే ఈ విధంగా జనాలు ఇచ్చారు అనుకోవాలి. ఈ విరాళాలు చూస్తే పాతిక యాభై వేల నుంచి మొదలు పెడితే పది నుంచి పాతిక కోట్ల దాకా పెద్ద మొత్తాలలో వచ్చాయి.

దీనిని చూసిన వారు బాబు మీద నమ్మకం తోనే ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు అని అంటున్నారు. అదే ప్లేస్ లో మరో సీఎం అయినా దేశంలో ఎవరైనా ఇలా విరాళాలు అడిగినా ఇంత పెద్ద మొత్తం అతి తక్కువ టైం లో పోగు అయ్యేది కాదు అనే అంటారు. సీఎం సీట్లో కూర్చున్న వారిని బట్టే జనాలు కూడా నమ్మి ఇస్తారు అని అంటున్నారు.

ఇదొక్కటే కాదు బాబు పిలుపు ఇస్తే రెండవ మాట లేకుండా అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను ఇచ్చారు రైతులు. అది కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అలా కూడా ల్యాండ్ పూలింగ్ చేయవచ్చునా అన్నది కూడా అందరూ ఆలోచించేలా చేసింది.

ఇదే కాదు అమరావతి కోసం తలో ఇటుకా పది రూపాయలు పెట్టి కొనండి అని గతంలో బాబు సీఎం గా ఉన్నపుడు పిలుపు ఇచ్చినా మంచి స్పందన లభించింది. ఇదంతా బాబు సంపాదించుకున్న విశ్వాసం అనే చెప్పాలి. బాబుకు క్రెడిబిలిటీ లేదు అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తూ ఉంటారు కానీ బాబు దానిని ఎంత బలంగా సంపాదించుకున్నారు అన్నది ఇలాంటి సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.

ఏది ఏమైనా చంద్రబాబు నాయకత్వం పట్ల ప్రజలు చూపిస్తున్న విశ్వాసం ఎన్నతగినది అనే పలు సందర్భాలలో రుజువు అయింది. మళ్ళీ మళ్ళీ అదే రుజువు అవుతోంది. చంద్రబాబుకు కూడా ఉన్న ధీమా అదే. ఆయన ప్రజల నాడిని పట్టుకున్నారు. అందుకే ఆయన హామీలు ఇచ్చి కొన్ని నెరవేర్చకపోయినా ఆయనననే జనాలు ఎన్నుకుంటూ ఉంటారు.

బాబు చేసేది రాజకీయం అని తెలిసినా దానికే ఓటు వేస్తారు. ఇది ఒక విధంగా బాబు చేసుకున్న అదృష్టం అని కూడా చెప్పాలి. రాజకీయాలలో ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను ఎందరో ఎదుర్కొన్నారు. చంద్రబాబుకు అలాంటివి వచ్చినా అవి దూది పింజెలలా ఎగిరిపోతున్నాయి అంటే ఆయన సంపాదించుకున్న క్రెడిబిలిటీ అదేనేమో.