Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ఎన్ని లక్షల కేజీలంటే?

గడిచిన ఐదేళ్లలో కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయిన బియ్యం ఎగుమతుల విలువ రూ.950 కోట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 6:31 AM GMT
ఐదేళ్లలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ఎన్ని లక్షల కేజీలంటే?
X

టన్ను అంటే వెయ్యి కేజీలు. పది టన్నులు అంటే.. పదివేల కేజీలు.. వంద టన్నుల అంటే లక్ష కేజీలు. మరి.. 137 లక్షల టన్నులు అంటే? లెక్క మీరే వేసుకోండి. ఇన్ని లక్షల కేజీల బియ్యం గడిచిన ఐదేళ్లలో కాకినాడ పోర్టు నుంచి ఎగుమతైన వైనం చూసినప్పుడు విస్మయానికి గురి కావాల్సిందే. ఎందుకుంటే.. ఇంత భారీగా జరిగే ఎగుమతుల్లో అక్రమ బియ్యమే అధికంగా ఉండటం. నిన్నటి పవన్ కల్యాణ్ సాసహం తర్వాత.. ఆఫ్రికా దేశాలకు అక్రమంగా ఎగుమతి అయ్యే బియ్యం లెక్క ఎంతన్నది తేలటమే కాదు.. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

ఇంత భారీ ఎత్తున అక్రమంగా ఎగుమతి అవుతుంటే.. ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే.. అందులో 50 శాతం పీడీఎస్ బియ్యం (పేదలకు ఉచితంగా ఇచ్చేవి) అని చెప్పటం చూస్తే..ఇంత భారీ ఎత్తున ప్రొక్యూర్ మెంట్ ఎలా సాధ్యమవుతుంది? అన్నది ప్రశ్న. ఎంతో డీప్ నెట్ వర్కు ఉంటే తప్పించి.. లక్షలాది కేజీల అక్రమ బియ్యం సేకరించటం అంత తేలికైన విషయం కాదు.

గడిచిన ఐదేళ్లలో కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయిన బియ్యం ఎగుమతుల విలువ రూ.950 కోట్లుగా చెబుతున్నారు. ఇక.. ఐదేళ్లలో ఈ పోర్టు నుంచి ఎగుమతి అయిన బియ్యం లెక్కలు చూస్తే..

ఏడాది బియ్యం

2019-20 19 లక్షల టన్నులు

2020-21 27 లక్షల టన్నులు

2021-22 29 లక్షల టన్నులు

2022-23 38 లక్షల టన్నులు

2023-24 24 లక్షల టన్నులు

ఇంతభారీగా ఎలా ప్రొక్యూర్ చేస్తారన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. పౌర సరఫరా శాఖకు చెందిన కీలక అధికారులతో పాటు.. పెద్ద ఎత్తున నెట్ వర్కు ఇన్ వాల్వ్ అయి ఉంటుందని చెప్పాలి. పవన్ కల్యాణ్ మాటల్లో చెప్పాలంటే.. తాను కాకినాడకు వస్తానంటే.. 10 వేల మందికి సంబంధించిన అంశంగా చెప్పి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని చెప్పటం మర్చిపోకూడదు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేజీ బియ్యాన్ని ఆరు రూపాయిల చొప్పున కొనుగోలు చేసి.. వాటిని ఒక పద్దతిలో ప్రాసెస్ చేసి ఆఫ్రికా దేశాలకు రూ.70 చొప్పున అమ్ముతారని చెబుతున్నారు. అంటే.. వందలాది కోట్ల రూపాయిల మొత్తం చేతులు మారుతుందని చెప్పాలి. ఈ ఎపిసోడ్ లో వేళ్లు మొత్తం చూపిస్తున్న పెద్ద మనిషి వైసీపీకి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిగా చెబుతునారు. ఆయన కుటుంబం చేతిలో ఉన్న రైస్ మిల్లులు.. పౌరసరఫరా శాఖ అధికారుల సహకారంతో ఈ మాఫియా విస్తరించిందని చెబుతున్నారు.

గతంలో కాకినాడ పోర్టు నుంచి ఐదు దేశాలకు మాత్రమే బియ్యం ఎగుమతి అయ్యేది. అయితే 2019 తర్వాత మాత్రం సీన్ మారింది. తర్వాత నుంచి 14 దేశాల వరకు ఎగుమతుల్ని విస్తరించారు. వీటిలో ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికా దేశాలతోపాటు ఇండోనేషియా.. చైనాకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. బియ్యం ఎగుమతి చేసిన తర్వాత.. పేమెంట్లు ఆలస్యం అవుతున్న వైనంతో.. ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నారో.. ఆయా దేశాల్లోని పోర్టులకు సమీపంలో పెద్ద ఎత్తున గోదాముల్ని నిర్మించేందుకు సైతం సిద్ధమవుతున్న విషయం తెలిస్తే.. నోటి వెంట మాట రాదంతే.