Begin typing your search above and press return to search.

ఎన్ కన్వెషన్... ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏమిటి?

అయితే.. ప్రస్తుతం శ్రావణమాసం కావటం.. రానున్న వారంలో మూడు పెళ్లిళ్ల వరకు ఎన్ కన్వెన్షన్ లో చేసుకునేందుకు వీలుగా బుకింగ్ లు చేసుకున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 4:40 AM GMT
ఎన్ కన్వెషన్... ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏమిటి?
X

మాదాపూర్ లో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ఫంక్షన్ హాలును హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధికారులు శనివారం ఉదయం కూల్చివేసిన సంగతి తెలిసిందే. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఆరోపించి ఈ పనికి పూనుకుంది.

దీంతో.. శనివారం రోజంతా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. శనివారం ఉదయాన్నే ఈ కూల్చివేత పనులు ప్రారంభించిన హైడ్రా.. కూల్చివేత పనులు ఆపాలంటు మధ్యాహ్నం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చేసరికే ప్రధాన కట్టడాలను కూల్చివేసింది. స్టే ఆర్డర్ అనంతరం అధికారులు వెనుదిరిగారు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ ఫంక్షన్ హాల్ ను ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోపక్క అక్కడ పనిచేసేవారూ ఇకపై తమ పరిస్థితి ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10 నుంచి 13 సంవత్సరాలుగా పని చేస్తున్నట్లు చెబుతున్నవారు.. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క ఇప్పటికే ఈ ఫంక్షన్ హాల్ ని పలు కార్యక్రమాల కోసం అడ్వాన్స్ బుక్కింగ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఎన్ కన్వెషన్ లో మొత్తం మూడు హాల్స్ ఉన్నాయి. ఇందులో హాల్ పరిమాణం, ఇతర ఖర్చుల ఆధారంగా బుక్కింగ్ కు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని అంటున్నారు.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మెరకు... ఇప్పటికే ఎన్ కన్వెషన్స్ లో సుమారు 20 అడ్వాన్స్ బుకింగ్ లు జరిగాయని.. ఈ వివాహ కార్యక్రమాలన్నీ రాబోయే కొద్ది రోజుల్లోనే జరగనున్నాయని అంటున్నారు. అయితే శనివారం ఈ కన్వెషన్ ఫంక్షన్ హాల్ ను కూల్చివేయడంతో... ఈ అడ్వాన్స్ బుక్కింగ్ లపై అనిశ్చితి నెలకొంది.

ఈ సమయంలో... మరో ఫంక్షన్ హాల్ కోసం ఇప్పటికే బుక్ చేసుకున్నవారు తిరుగుతున్నారట. ఈ క్రమంలోనే బుకింగ్ లు చేసిన వ్యక్తులు ఎన్ కన్వెషన్ మేనేజ్మెంట్ నుండి వెంటనే రీఫండ్స్ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే... తీసుకున్న అడ్వాన్స్ లు మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయంలో యాజమాన్యం ఇంకా ప్రణాళికలు రూపొందించలేదని తెలుస్తోంది.