‘లక్ష’కు పైగా మెజార్టీతో ఏపీలో ఎవరెంటే?
ఎన్నికల్లో పోటీ చేయటం ఒక ఎత్తు. అందులో గెలవటం మరో ఎత్తు. ఇక.. హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో గెలుపే గొప్పది.
By: Tupaki Desk | 4 Jun 2024 9:42 AM GMTఎన్నికల్లో పోటీ చేయటం ఒక ఎత్తు. అందులో గెలవటం మరో ఎత్తు. ఇక.. హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో గెలుపే గొప్పది. మెజార్టీ అస్సలు విషయమే కాదు. అలాంటిది హోరాహోరీ పోరులో గెలుపు మాత్రమే కాదు.. మెజార్టీ అది కూడా లక్ష మార్క్ ను దాటేసి దూసుకెళ్లే మెజార్టీ సాధించటం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ.. అలాంటి రికార్డును క్రియేట్ చేశారు ఏపీలోని పలువురు అభ్యర్థులు.
దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలోని 25 ఎంపీ స్థానాల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే.. గెలుపు లాంఛనమే. ఎందుకంటే ఇప్పటివరకు (మధ్యాహ్నం 2 గంటల నాటికి) కొందరు అభ్యర్థులు విజయం దిశగా వెళ్లటమే కాదు.. మెజార్టీ లక్ష మార్క్ ను దాటేసిన పరిస్థితి. మొత్తం కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి ఎన్ని లక్షలు వారి మెజార్టీగా మారతుుందన్నది తేలాల్సి ఉంది.
ఏపీలోని మొత్తం 25 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ 16 స్థానాల్లో వైసీపీ 4 స్థానాల్లో బీజేపీ మూడు స్థానాల్లో.. జనసేన రెండు స్థానాల్లో తమ అధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు వెల్లడైన కౌంటింగ్ ఫలితాల ప్రకారం చూస్తే.. శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్మోహన్ నాయుడు 1,81,370 ఓట్లను సొంతం చేసుకుంటే.. విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని చిన్ని 1,82,630 ఓట్లతో సాగుతున్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ 1,79,824 ఓట్లతో.. అమలాపురం అభ్యర్థి జీఎం హరీశ్ 1,65,178 ఓట్లు.. విశాఖ పట్నం టీడీపీ అభ్యర్థి 1,62,181, నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1,14,097 ఓట్లతో.. అమలాపురం లోనే 1,01,352 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు సైతం భారీ మెజార్టీని సొంతం చేసుకుంటున్నారు.
రాజమహేంద్రవరం నుంచి బరిలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి 2,19,688 ఓట్ల అధిక్యంలో ఉండగా.. నరసాపురంలో భూపతిరాజు శ్రీనివాసవర్మ 2,12,681 ఓట్లు.. అనకాపల్లిలో సీఎం రమేశ్ 1,09,140 ఓట్లు.. కాకినాడ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ 1,10,237 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా లక్షమార్కును దాటేసి దూసుకెళుతున్న ఈ అభ్యర్థులు మరింత భారీ మెజార్టీని సొంతం చేసుకుంటారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.