Begin typing your search above and press return to search.

కిక్కిరిసిన కేస‌ర‌ప‌ల్లి.. ఎటు చూసినా కిలో మీట‌ర్ల ర‌ద్దీ!

కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 9:45 AM GMT
కిక్కిరిసిన కేస‌ర‌ప‌ల్లి.. ఎటు చూసినా కిలో మీట‌ర్ల ర‌ద్దీ!
X

కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్ర‌త్యక్షంగా చూసేందుకు తెలుగు తమ్ముళ్లు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకోవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలిరావడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. పలుచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా విజ‌య‌వాడ-క‌ల‌క‌త్తా ర‌హదారిలో ఎటు చూసినా జ‌నాలే క‌నిపించారు.

ద్విచ‌క్ర వాహ‌నాల‌పై వ‌చ్చేవారు.. న‌డుస్తూ వ‌చ్చేవారు.. ఇలా ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఎక్కువ మంది ప్రాంగణానికి చేరుకునేందుకు ఇబ్బంది ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో చాలా మంది ఉన్న‌చోటే ఉండి.. పోయారు. మ‌రోవైపు.. ప్రాంగ‌ణానికి చేరుకున్న‌వారితోనూ పెద్ద ఎత్తున ర‌ద్దీ ఏర్ప‌డింది. ఈ ర‌ద్దీలో చాలా మంది కీల‌క నాయ‌కులు కూడా చిక్కుకుపోయారు.

ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకా రానికి బయలుదేరిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గన్నవరం జంక్షన్ వద్ద ట్రాఫిక్లో చిక్కుకు న్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయ‌న అక్క‌డే ఉండిపోయారు. దీంతో తక్షణమే స్పందించిన పోలీసు అధికారులు వెంకయ్య కాన్వాయ్‌కి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి పంపించారు. అదేవిధంగా మ‌రికొంద‌రు నాయ‌కులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు త‌ప్ప‌లేదు.