Begin typing your search above and press return to search.

మనిషి మెదడు పెరుగుతోంది తెలుసా?

మనిషి పుట్టుకే ఓ గమ్మత్తుగా ఉంటుంది. మనిషి పరిణామ క్రమం కూడా విచిత్రంగానే ఉండటం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 March 2024 4:49 AM GMT
మనిషి మెదడు పెరుగుతోంది తెలుసా?
X

మనిషి పుట్టుకే ఓ గమ్మత్తుగా ఉంటుంది. మనిషి పరిణామ క్రమం కూడా విచిత్రంగానే ఉండటం తెలిసిందే. ఈనేపథ్యంలో మనిషి జన్మ గురించి పలు రకాల వాదనలు వస్తూనే ఉంటాయి. మానవ మనుగడకు ప్రధానం మెదడు. మెదడు సంకేతాలతోనే మన క్రియలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే మానవ మెదడు పలు రకాల పనులు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనేది నిర్వివాదాంశమే.

మనుషుల మెదడు పరిమాణం పెరుగుతోంది. అమెరికాలో జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. 1930లలో జన్మించిన వారి కంటే 1970లో పుట్టిన వారి మెదడు 6.6 శాతం పెరిగినట్లు గుర్తించారు. 1999-2019 మధ్య 3,226 మంది మెదళ్లపై జరిపిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది. వారి మెదడును ఎంఆర్ఐ తీసి పరిశోధన జరిపారు.

1930లో మెదడు సగటు పరిమాణం 1,234 గ్రాములు ఉండగా 1970లో పుట్టిన వారికి 1,321 గ్రాములు ఉన్నట్లు తేలింది. మెదడు సైజు పెరగడం వల్ల మతిమరుపు సమస్య తగ్గినట్లు తెలుస్తోంది. మెదడు పరిమాణం పెరడంతో తెలివి కూడా మీరుతోంది. గతంలో ఉన్న వారికి ఇప్పటి తరం వారికి తెలివితేటల్లో తేడాలున్నట్లు గుర్తించారు. ఇలా మెదడు తన ప్రభావాన్ని పెంచుతోంది.

మనిషి తన ఆలోచనలకు కేంద్ర బిందువు మెదడే. అక్కడ నుంచి వచ్చే సంకేతాలతోనే పనులు చేస్తుంటాం. మెదడు పరిమాణం పెరగడం వల్ల తెలివి కూడా పెరిగింది. దీని వల్ల చాలా రంగాల్లో మనుషులు రాణించడం చూస్తున్నాం. ఇప్పటి తరం చిన్నపిల్లల ప్రవర్తనలో కూడా తేడాలున్నట్లు తెలుసుకుంటున్నాం. ఇలా మెదడు పెరడం వల్ల మనకు ప్రయోజనాలు కూడా ఉంటున్నాయి.

మనదేహంలోని నరాల వ్యవస్థకు మెదడుతో అనుసంధానం ఉంటుంది. మనకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా అది మెదడుకు చేరుతుంది. తరువాత అక్కడ నుంచి వచ్చే సందేశంతో మనం తరువాత చర్యలు తీసుకుంటాం. ఉదాహరణకు మనకు కాలితే దాని సంకేతం కూడా మనకు వెంటనే వస్తుంది. అప్పుడు మనం దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. ఇలా మెదడు నిర్వహణతోనే మన ప్రయాణం జరుగుతుంది.