వీడియోస్ : లెబనాన్ లో పేలిన వందల పేజర్లు... భారీగా మృతులు వేలాదిగా క్షతగాత్రులు
ఈ క్రమంలో తాజాగా లెబనాన్ తో పాటు సిరియాలో వేలాదిగా పేజర్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి.
By: Tupaki Desk | 17 Sep 2024 4:52 PM GMTపశ్చిమాసియాలో మరోసారు రక్తపాతం రాజుకుంది. ఇజ్రాయిల్ కి లెబనాన్ కి మధ్య మొదలైన గాజా యుద్ధం నేపథ్యంలో తాజాగా లెబనాన్ లోని హెజ్ బుల్లాల మధ్య దాడులు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా లెబనాన్ తో పాటు సిరియాలో వేలాదిగా పేజర్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దాంతో ఎనిమిది మంది మరణించినట్లుగా తెలుస్తోంది.
అదే విధంగా వేలాదిగా గాయపడినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ దారుణ ఘటనలో లెబనాన్ సభ్యులతో సహా మూడు వేల మంది దాకా గాయపడ్డారు అని అంటున్నారు. ఇక మృతులు చూస్తే ఎనిమిది మంది దాకా ఉన్నారు. వీరిలో హెజ్ బుల్లా సభ్యులు ఉన్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇక లెబనాన్ లోని ఇరాన్ రాయబారి కూడా ఈ ఘటనలో గాయపడినట్లుగా చెబుతున్నారు
పేజర్లు చేతిలో పట్టుకునే విధంగా ఉంటాయి. వీటిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పేల్చేసారు అని అంటున్నారు. అవి కూడా హెజ్ బుల్లా సభ్యులు వాడుతున్న పరికరాలే పేలిపోయినట్లుగా చెబుతున్నారు. వారినే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఈ దాడికి పాల్పడింది అని లెబనాన్ లోని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇక చూస్తే కనుక లెబనాన్ రాజధాని బిరూట్ శివార్లు అన్నీ కూడా రక్తసిక్తం అయిపోయాయి. చేతులు ప్యాంట్ జేబుల వద్ద్ద తీవ్ర గాయాలతో పడిపోయిన వేలది మందితో అక్కడ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలలో కూడా వైరల్ అవుతున్నాయి.
ఇక బాధితులు క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో వారికి అత్యవసర వైద్యం అందించాలని లెబనాన్ ఆరోగ్య శాఖ ఆదేశాలను జారీ చేసింది. అంతే కాదు వైర్ లెస్ పరికరాలు ఉపయోగించవద్దని కూడా సూచించింది.
విషయానికి వస్తే గాజాతో యుద్ధం తరువాత లెబనాన్ లోని హెజ్ బుల్లాలు ఇజ్రాయిల్ దళాల మధ్య భీకరమైన సమరం సాగుతోంది. దీంతో వాతావరణ వేడెక్కి ఉంది. ఎపుడు ఏమి జరుగుతుందో తెలియని నేపథ్యంలో ఇపుడు ఈ రకమైన పేజర్ పేల్చివేత ఒక్కసారిగా మారణ హోమానికి తెర తీసినట్లు అయింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే లెబనాన్ కి ఇది అతి పెద్ద భద్రతా వైఫల్యంగా చెబుతున్నారు. లెబనాన్ లోని హెజ్ బుల్లాలు ఉపయీగించే పేజర్ పరికరాలు పేలి పోవడం అంటే టోటల్ ఫెయిల్యూర్ గానే చూస్తున్నారు.