Begin typing your search above and press return to search.

వాడికి క్షమాభిక్ష పెట్టి రాజీనామా చేసిన ఆ దేశ అధ్యక్షురాలు

ఒక పిల్లల హోం నిర్వహించే కేంద్రంలో అక్కడి పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడిన ఆరోపణలపై సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ను అరెస్టు చేశారు

By:  Tupaki Desk   |   11 Feb 2024 11:30 AM GMT
వాడికి క్షమాభిక్ష పెట్టి రాజీనామా చేసిన ఆ దేశ అధ్యక్షురాలు
X

మీరు చదివింది కరెక్టే. ఒక మహిళ దేశాధ్యక్షురాలిగా ఉన్న దేశంలో.. ఒక కామపిశాచి పిల్లలపై లైంగిక వేధింపులకు గురై.. ఆ నేరానికి జైలుకు వెళ్లి.. కోర్టులో దోషిగా తేలిస్తే.. అతడికి క్షమాభిక్ష పెట్టి దేశ ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు. దీంతో.. ఆమె దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కేటలిన్ నోవక్. ఈ ఉదంతానికి వేదికగా మారింది హంగేరి. యూరోపియన్ దేశాల్లో ఒకటైన ఈ దేశంలో నెలకొన్న తాజా పరిస్థితి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు పడేలా చేసింది.

ఒక పిల్లల హోం నిర్వహించే కేంద్రంలో అక్కడి పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడిన ఆరోపణలపై సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ను అరెస్టు చేశారు. అయితే.. అతను తప్పించుకునే ప్రయత్నం చేసినా.. అతడు చేసి తప్పుడు పనుల్ని కోర్టు గుర్తించి.. అతడ్ని దోషిగా తేల్చారు. జైలుశిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏప్రిల్ లో పోప్ దేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ కామపిశాచికి క్షమాభిక్ష ప్రసాదించారు.

తాజాగా ఒక మీడియా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో.. అప్పటి నుంచి ఆ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున దేశాధ్యక్షురాలు కేటలిన్ నోవక్ నిర్ణయాన్ని తప్పు పడుతూ నిరసనలు మొదలు పెట్టాయి. దీంతో దేశ ప్రజలంతా ఆమె నిర్ణయాన్ని తప్పు పడుతూ ఆందోళనల్ని చేపట్టారు. అంతకంతకూ పెరిగిన నిరసనలతో పాటు ఆమెను దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

ఆమెపై దేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన సమయంలో ఆమె ఖతార్ పర్యటనలో ఉన్నారు. అయితే.. ఆమె తీరును తప్పు పడుతూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అధ్యక్ష భవనం ఎదుట ఆందోళన చేపట్టాయి. దీంతో.. హుటాహుటిన హంగేరికి వచ్చిన దేశాధ్యక్షురాలు.. తాను తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నారు. తానెప్పుడు బాధితుల పక్షానే నిలుస్తానని.. అందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదంటూ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

తాను తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ప్రతిగా దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకన్నారు. తాను తీసుకున్న క్షమాభిక్ష నిర్ణయం.. దానికి సంబంధించి సరైన వివరణ ఇవ్వటంలో తాను ఫెయిల్ అయ్యానని పేర్కొన్న ఆమె.. తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది.