Begin typing your search above and press return to search.

సంచలనంగా మారిన 24 పేజీల డెత్ నోట్... భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య!

అవును... బెంగళూరులోని మంజునాథ్ లే అవుట్ ప్రాంతంలో 34 ఏళ్ల టెకీ సుమారు 24 పేజీల డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   11 Dec 2024 5:19 AM GMT
సంచలనంగా మారిన 24 పేజీల డెత్  నోట్... భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య!
X

ఉత్తరప్రదేశ్ కు చెందిన 34 అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూరులోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సుభాష్.. తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ 24 పేజీల డెత్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు!

అవును... బెంగళూరులోని మంజునాథ్ లే అవుట్ ప్రాంతంలో 34 ఏళ్ల టెకీ సుమారు 24 పేజీల డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆ సమయంలో తన అపార్ట్ మెంట్ లో "న్యాయం జరగాలి" అనే ఫ్లకార్డును ఉంచి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సూసైడ్ నోట్ లో తన జీవితంలో ఎదురైన వైవాహిక సమస్యలు.. తనపై నమోదైన అనేక కేసుల కారణంగా కొన్ని సంవత్సరాలుగా తాను పడుతున్న మానసిక క్షోభను వివరించాడని అంటున్నారు. అతని భార్య, ఆమె బంధువులు అతనిపై దాఖలు చేసిన తొమ్మిది పోలీసు ఫిర్యాదులు అతని ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారని అంటున్నారు.

ఇదే సమయంలో... తనను ఆర్థికంగా దోపిడీ చేయడానికి తన నాలుగేళ్ల కొడుకు నిర్వహణను ఎలా ఆయుధంగా చేసిందీ కూడా వివరించారని అంటున్నారు! ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత సుభాష్ రాసుకున్న 24 పేజీల డెత్ నోట్ ను పలువురిని ఈ మెయిల్ చేసినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో... తనకు అనుబంధంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వాట్సప్ గ్రూపులోనూ షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... తన డెత్ నోట్ తో పాటు వాహన తాళాలు.. పూర్తయిన, పెండింగులో ఉన్న పనుల జాబితతో సహా పలు వివరాలను అల్మారాపై అతికించాడని పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా... న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని సూచించే చర్యలో భాగంగా తన పరిస్థితిని వివరించే వీడియోను రికార్డ్ చేసి, ఎక్స్ లో పోస్ట్ చేశాడు! ఆ పోస్టులో భారత్ లో పురుషులపై చట్టబద్దమైన మారణహోమం జరుగుతోందని పేర్కొంటూ మస్క్, ట్రంప్ లను ట్యాగ్ చేసినట్లు చెబుతున్నారు!

భార్య దాఖలు చేసిన కేసులు!:

యాక్సెంచర్ లో పనిచేస్తున్న సుభాష్ భార్య నికితా సింఘానియా.. వరకట్న వేధింపులు, అసహజ సెక్స్ వంటి ఆరోపణలపై దాఖలు చేసిన కేసులను సూసైడ్ నోట్ లో ప్రత్యేకంగా వివరించారు సుభాష్. వీటితో పాటు తన మామగారు మరణానికి తానే కారణం అని కేసులు పెట్టారని అంటున్నారు.

ఇందులో భాగంగా... అదనపు కట్నం కోసం డిమాండ్ చేయడం వల్ల తన తండ్రి షాక్ తో మరణిచించాడని నికిత పేర్కొందని అంటున్నారు. అయితే... క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో తన తండ్రి హత్య ఆరోపణలు తప్పు అని నికిత అంగీకరించిందని.. ఆమె తండ్రి ఎప్పటినుంచో ఉన్న గుండె సంబంధిత వ్యాధి కారణంగా మరణించాడని ఒప్పుకుందని తెలిపారు!

యూపీలోని జౌన్ పూర్ లోని ఫ్యామిలీ కోర్టులో ఈ కేసులు పెండింగిలో ఉన్నాయని.. తన భార్య గతంలో రూ.కోటి మెయింటెనెన్స్ డిమాండ్ చేసిందని, తర్వాత దాన్ని రూ.3 కోట్లకు పెంచిందని టెక్కీ ఆరోపీంచారు. ఈ కేసు విచారణ సందర్భంగా... న్యాయమూర్తి అవహేళన చేస్తూ.. నువ్వు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదు! అని అన్నారని నోట్ లో ఆరోపించినట్లు తెలుస్తోంది.

సుభాష్ చివరి కోరికలు!:

ఈ సూసైడ్ నోట్ లో సుభాష్ తన చివరి కోరికలను రాసుకొచ్చాడని అంటున్నారు. ఇందులో భాగంగా.. తన కేసు విచారణలన్నీ ప్రత్యక్షంగా జరగాలని.. ఈ మహిళలు చేస్తున్న న్యాయ వ్యవస్థ భయంకరమైన స్థితి, చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలని కోరినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో... తన కేసులను కర్ణాటకలోనే విచారించాలని.. తన అనుభవం ఆధరంగా బెంగళూరు కోర్టులు యూపీ కోర్టుల కంటే చాలా చట్టబద్ధమైనవని.. న్యాయ ప్రయోజనాల కోసం కర్ణాటకలో కేసులను నడపాలని.. విచారణ జరిగే వరకూ ఆమెను బెంగళూరులోని జ్యూడీషియల్ కస్టడీలోనే ఉంచాలని సుభాష్ అభ్యర్థించారని అంటున్నారు!

ఈ నేపథ్యంలో సుభాష్ కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా క్యాంపెయిన్ (#JusticeForAtulSubhash) ప్రారంభమైంది. ఆ నోట్ లో న్యాయ వ్యవస్థపై సుభాష్ చేసిన ఆరోపణలపైనా చర్చ జరగాలని కోరుతున్నారు.