Begin typing your search above and press return to search.

ఇదో పెద్ద హేట్ క్రైమ్ స్టోరీ... మాంసం కుక్కర్ లో, ఎముకలు రోట్లో!

అవును... భార్యాభర్తల మధ్య చిన్న పాటి గొడవలు, అభిప్రాయ భేదాలు అత్యంత సహజం అని అంటారు.

By:  Tupaki Desk   |   23 Jan 2025 4:52 AM GMT
ఇదో పెద్ద హేట్  క్రైమ్  స్టోరీ... మాంసం కుక్కర్  లో, ఎముకలు  రోట్లో!
X

ప్రపంచంలో నిత్యం ఎన్నో క్రైమ్ కథలు తెరపైకి వస్తుంటాయి.. ఎన్నో ఘోరమైన సంఘటనలు వెలుగు చూస్తుంటాయి.. అయితే తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఘోరం మాత్రం అంతకు మించి అని అంటున్నారు. భార్యతో గొడవపడిన భర్త క్షణికావేశంలో చేసిన కిరాతకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేమిటనేది ఇప్పుడు చూద్దామ్..!

అవును... భార్యాభర్తల మధ్య చిన్న పాటి గొడవలు, అభిప్రాయ భేదాలు అత్యంత సహజం అని అంటారు. ఇలానే మొదలైనట్లు భార్యతో గొడవపడిన భర్త క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుచేసి కుక్కర్ లో ఉడికించాడు. ఈ కిరాతకం రంగారెడ్డి జిల్లా మీర్ పేట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

అందుతున్న సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవి (35)కి అదే గ్రామానికి చెందిన గురుమూర్తి (39)తో 13 ఏళ్ల కిందట వివాహామైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న గురుమూర్తి... ప్రస్తుతం డీఆర్డీవో లో కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో... రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో వీరి మధ్య గొడవ మొదలైనట్లు చెబుతున్నారు. ఇది చినికి చినికి గాలివానగా మారగా.. గురుమూర్తి భార్య తలపై రెండుసార్లు గట్టిగా కొట్టినట్లు చెబుతున్నారు.

దీంతో... వెంకట మాధవి వెంటనే సృహతప్పి పడిపోగా.. ఆమె మరణించినట్లూ భావించిన గురుమూర్తి.. మృతదేహాన్ని మాయం చేయాలని భావించినట్లు చెబుతున్నారు. దీంతో.. ఆ మృతదేహాన్ని కత్తితో ముక్కలుముక్కలుగా నరికి, ముక్కలను కుక్కర్ లో వేసి ఉడికించి.. ఎముకలను వేరు చేసి, రోట్లో వేసి పోడిగా మార్చాడు.

అనంతరం ఉడికిన శరీర అవశేషాలను, ఎముకల పొడిని తీసుకుని సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి అందులో పాడేశాడట. ఈ విషయాన్ని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే.. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఈ నెల 18న భార్య తల్లికి ఫోన్ చేసి వెంకట మాధవి కనిపించడం లేదని, చిన్న గొడవ అవ్వడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడట.

దీంతో... అదే రోజున మీర్ పేట పోలీస్ స్టేషన్ లో అల్లుడి సూచనలతో కుమార్తె అదృశ్యమైనట్లు వెంకట మాధవి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో ఆమెతో పాటు గురుమూర్తి కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ సమహ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవి ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఈ క్రమంలో.. గురుమూర్తి ఫ్యామిలీ ఉంటున్న ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారంట. అయితే.. ఆ కెమెరాల్లో ఎక్కడా మాధవి ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు ఆధారాలు లభించలేదని అంటున్నారు. ఈ సమయంలో ఒకటికి రెండు సార్లు గురుమూర్తి మాత్రమే ఇంట్లో నుంచి బయటకు, బయట నుంచి ఇంట్లోకీ రాకపోకలు సాగించినట్లు రికార్డ్ అయ్యిందని అంటున్నారు.

దీంతో... ఇంట్లోనే ఏదో జరిగి ఉంటుందని భావించిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించారు. దీంతో.. తన భార్యను తానే చంపినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ చెరువులో మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నట్లూ చెబుతున్నారు. అయితే.. పోలీసులు అధికారికంగా ఇంకా ఈ వివరాలు వెల్లడించలేదు!