Begin typing your search above and press return to search.

దీపావళి సంబరాల్లో భార్యను సేవ్ చేయబోయి భర్త మృతి

ఈ క్రమంలో దీపాలు వెలిస్తున్నారు. దీపాలు వెలిగించే క్రమంలో రాఘవమ్మ చీర కొంగుకు నిప్పు అంటుకుంది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:29 AM GMT
దీపావళి సంబరాల్లో భార్యను సేవ్ చేయబోయి భర్త మృతి
X

హైదరాబాద్ లో విషాద ఉదంతం చోటు చేసుకుంది. అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. దీపావళి సందర్భంగా ఉత్సాహంగా టపాసులు కాలుద్దామన్న ఆలోచన.. పెను విషాదానికి కారణమైంది. టపాసులు కాల్చే వేళలో.. ప్రమాదం జరగటం.. అందులో భార్యను కాపాడపోయి భర్త గాయాల బారినపడి మరణించిన ఉదంతం చోటు చేసుకుంది. మరోవైపు భార్యకు గాయాలుకావటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రేమ్ విజయనగర్ కాలనీలోని ఒక అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నారు 82 ఏళ్ల రాఘవరావు.. ఆయన సతీమణి 79 ఏళ్ల రాఘవమ్మ ఉంటున్నారు. దీపావళి సందర్భంగా టపాసులు తీసుకొచ్చుకున్న వారు.. వాటిని కాలుద్దామనుకున్నారు. ఈ క్రమంలో దీపాలు వెలిస్తున్నారు. దీపాలు వెలిగించే క్రమంలో రాఘవమ్మ చీర కొంగుకు నిప్పు అంటుకుంది.

భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన రాఘవరావు మంటల్లో చిక్కుకుపోయి మరణించారు. మంటల్లో చిక్కుకున్న రాఘవమ్మ 80 శాతం కాలిన గాయాలతో గాంధీకి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. పెద్ద వయసుకావటం.. శరీరం పెద్ద ఎత్తున కాలిపోవటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది. పండుగ పూట చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో విషాదంగా మారింది.