Begin typing your search above and press return to search.

భార్యకు తుది వీడ్కోలు... గుండెలు పిండేసే 1902 నాటి లేఖ వైరల్!

మే 19 - 1902లో అమెరికా దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన గని విపత్తు ఫ్రాటర్ విల్లే గనిలో జరిగింది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 9:58 AM GMT
భార్యకు తుది వీడ్కోలు... గుండెలు పిండేసే 1902 నాటి లేఖ వైరల్!
X

మే 19 - 1902లో అమెరికా దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన గని విపత్తు ఫ్రాటర్ విల్లే గనిలో జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున బొగ్గు ధూళి, పేలుడు శిధిలాలు, విషపూరితమైన మీథేన్ వాయువు గని నుంచి బయటకు వెలువడ్డాయి. దీంతో.. నాడు ఆ గనిలో పనిచేస్తున్న 190 మంది అత్యంత దారుణంగా మరణించారు.


ఈ సమయంలో ఆ ప్రాణాంతక వాయువు వెలువడటాన్ని మూసివేసే ప్రయత్నంలో 26మంది కొన్ని గంటల తర్వాత దురదృష్టవసాత్తు ఊపిరాడక చనిపోయారు. ఇది అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా చెబుతారు. ఆ సమయంలో తమ మరణానికి ముందు చాలా మంది తమ ప్రియమైనవారికి మెసేజ్ లు రాశారు.

ఈ నేపథ్యంలోనే ఆ ప్రమాదంలో చివరి క్షణాలు అనుభవిస్తూ, మరణం తనను అక్కున చేర్చుకోబోతుందని భావిస్తూ ఓ వ్యక్తి తన భార్యకు రాసిన లేఖ తాజాగా తెరపైకి వచ్చింది. తన జీవితంలో చివరి క్షణాలను, వాటి తాలూకు ఆలోచనలను తన జీవిత భాగస్వామితో పంచుకుంటూ సదరు వ్యక్తి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... "ఎలెన్ నీకు గుడ్ బై.. నీతో జీవించాలని ఎంతో కోరుకుంటున్నా.. కానీ నిన్ను ఘోరమైన స్థితిలో వదిలి వెళ్తున్నా. ప్రియమైన భార్య... పిల్లలను పెంచడ్దంలో మీకు సహాయం చేయడానికి ప్రభువుపై నమ్మకం ఉంచు. ఎలెన్, నా డార్లింగ్ లిల్లీని జగ్రత్తగా చూసుకో. ఇక్కడ మేము కొంతమందిమి మాత్రమే ఉన్నాము.. మిగిలిన వారు ఎక్కడున్నరో నాకు తెలియదు... ఎల్బర్ట్ మిమ్మల్ని స్వర్గంలో కలవమని చెప్పాడు.. పిల్లలందరికీ చెప్పు.. అక్కడ మా ఇద్దరినీ కలవండి!" అని రాసుకొచ్చారు!

కాగా... ఈ ఘోర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం కోల్ క్రీక్ కమ్యూనిటీ నోరిస్ డ్యాం స్టేట్ పార్క్ లోని లెనోయిర్ మ్యూజియంలో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. జాకబ్ పావెల్ రాసిన ఈ లేఖ ఆ మైనింగ్ విపత్తు ఎలాంటి నష్టాన్ని మిగిల్చిందనే విషయాన్ని పూర్తిగా గుర్తు చేసుంది.