Begin typing your search above and press return to search.

భార్య ఖర్చులు భరించలేక హత్య.. భర్త సంచలన నిర్ణయం!

భార్య ఖర్చులు ఎక్కువచేస్తుందని ఓ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 10:30 PM GMT
భార్య ఖర్చులు భరించలేక హత్య.. భర్త సంచలన నిర్ణయం!
X

భార్య ఖర్చులు ఎక్కువచేస్తుందని ఓ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు చెప్పి చూశాడో లేదో తెలియదు కానీ.. ఆమె ఖర్చులకు విపరీతంగా విసిగిపోయాడో ఏమో కానీ.. ఆమెపై ఖర్చుల విషయంలో విపరీతమైన ఆగ్రహం పెంచేసుకున్నాడు. ఈ సమయంలో సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. ఆమెను చంపడానికి సుపారీ ఇచ్చి, హత్య చేయించాడు.

అవును... మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తోందన్న కోపంతో ఆమెను హత్య చేయించాలని భావించాడో భర్త. ఎన్నిసార్లు చెప్పినా డబ్బులు తగలేసోందనే అసహనం పీక్స్ కి చేరిపోయిందో ఏమో కానీ... ఈ పని కోసం రూ.2.5 లక్షలు ఖర్చుకు కూడా వెనుకాడలేదు.

ఈ నేపథ్యంలో... తెలిసిన ఓ వ్యక్తికి ఈ మేరకు అంత మొత్తం సుపారీ ఇచ్చి ఆ పని చేయించాడు. ఈ క్రమంలో ఈ హత్యను తొలుత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా రెండున్నర లక్షలు సుపారీ ఇచ్చి మరీ తన భార్యను అతడే హత్య చేయించాడనే విషయం బయటకు వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హేమంత్ శర్మ తన భార్య దుర్గావతి, ఆమె సోదరుడిని దగరలోని ఓ గుడికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి టూవీలర్ పై తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఓ కారు వచ్చి బలంగా బైక్ ని ఢీకొట్టింది. ఆ సమయంలో ఈ టూవీలర్ పై దుర్గావతితో పాటు ఆమె సోదరుడూ ఉన్నాడు.

ఈ ఘటనలో ఆమె, ఆమె సోదరుడూ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆమె మాత్రం హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ముందు అంత ఈ ఘటనను హిట్ అండ్ రన్ కేసు అనే అనుకున్నారు. అయితే అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ ను, హేమంత్ శర్మ ఇచ్చిన స్టేట్ మెంట్ ను పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది.

ఈ ప్రమాదం జరగడానికి ముందే అక్కడ కారు నిలిపి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో శర్మను పిలిచి కూర్చోబెడితే అన్ని విషయాలు బయటకు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా హేమంత్ శర్మకు దుర్గావతి రెండో భార్య అని తేలిందని చెబుతున్నారు. గత ఏడాది వీరిద్దరికీ కోర్టులో వివాహమైంది.

ఈ క్రమంలో మొదట్లో అంతా సాఫీగానే సాగినట్లు అనిపించినా... రోజు రోజుకీ దుర్గావతి ఖర్చులు విపరీతంగా పెట్టడం మొదలుపెట్టిందంట. ఇలా తన భార్య విపరీతంగా ఖర్చులు పెడుతుందన్న కోపంతో హేమంత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలిందని అంటున్నరు.