Begin typing your search above and press return to search.

వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్యపై ఫిర్యాదు.. మేటర్ రూ.200 కోట్లు!

వివరాల్లోకి వెళ్తే... కొండాపూర్ లో సర్వే నెంబర్ 87/2లో 2.8 ఎకరాల భూమి ఉండగా.. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొనుగోలు చేశారు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 3:00 AM GMT
వైవీ సుబ్బారెడ్డి,  ఆయన భార్యపై ఫిర్యాదు.. మేటర్  రూ.200 కోట్లు!
X

హైదరాబాద్ లో భూమి.. దాని విలువ సుమారు రూ.200 కోట్లు అని అంటున్నారు.. ఈ క్రమంలో వైసీపీలో అత్యంత కీలక నేతగా ఉన్న వ్యక్తి భార్యకు మరో వ్యక్తికి మధ్య ఇష్యూ జరుగుతుండగా.. మధ్యలో మూడో వ్యక్తి ఎంటరై.. వైసీపీ నేత, ఆయన భార్యపైన భూకబ్జాకు యత్నించారంటూ కేసు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిపై నెలకొన్న వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ వ్యవహారంలో వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతా రెడ్డి పేర్లు వినిపిస్తుండటంతో విషయం మరింత వైరల్ గా మారిందని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే... కొండాపూర్ లో సర్వే నెంబర్ 87/2లో 2.8 ఎకరాల భూమి ఉండగా.. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్థలాన్ని ఎల్ & టీ కి లీజుకిచ్చారు. ఈ క్రమంలో గడువు ముగిసిన అనంతరం 2022లో ఆ సంస్థ ఈ స్థలాన్ని ఖాళీ చేసేసింది.

ఈ క్రమంలో... అప్పటీ నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థలంలో ఎ. అనీల్ రెడ్డి అనే వ్యక్తి బోర్డులు పాతారు. ఈ సమయంలో ఆ భూమి తమదని, ఆ భూమిలో పాతిన బోర్డులు తీసి ఖాళీ చేయాలని స్వర్ణలతా రెడ్డి అడిగారు. దీంతో... అనిల్ రెడ్డి, అతడి అనుచరులు తమపై దాడి చేశారని జనవరి 5న స్వర్ణలతా రెడ్డి గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో జనవరి 8న నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎంటరై ఆ భూమిలో అనీల్ రెడ్డి పేరిట ఉన్న బోర్డులు తీసి పడేసి.. తన పేరుతో కొత్త బోర్డు పాతారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై స్వర్ణలతా రెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో అక్కడకు వెళ్లిన పోలీసులకు.. మళ్లీ వస్తామని చెప్పి అక్కడున్న వ్యక్తులు వెళ్లిపోయారు.

ఇలా ఈ భూమి తనదని స్వర్ణలతా రెడ్డి చెబుతుంటే... మరోపక్క అనిల్ రెడ్డి, నర్సింహారెడ్డి అనే వ్యక్తులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ భూమి తమదేనని బోర్డులు పెడున్నారు. మరోవైపు.. తమ భూమి కబ్జాకు యత్నించారంటూ నర్సింహారెడ్డి తరుపున అతని వాచ్ మన్ అదే రోజు వైవీ సుబ్బారెడ్డి, స్వర్ణలతా రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో.. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలను గచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్ తెలిపారు. దీంతో... హైదరాబాద్ లో అత్యంత విలువైన భూముల విషయంలో ఇలాంటి ఊహకందని, సినిమా సన్నివేశాలను తలదన్నే స్థాయిలో ట్విస్టులు ఎన్నో చోటు చేసుకుంటుంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!