Begin typing your search above and press return to search.

కేసీఆర్ హయాంలోని సీపీకే రేవంత్ సర్కార్ ఛాన్స్!

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు తాజాగా జరిగాయి. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వ్యులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 12:00 PM GMT
కేసీఆర్  హయాంలోని సీపీకే రేవంత్  సర్కార్ ఛాన్స్!
X

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు తాజాగా జరిగాయి. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ హయాంలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పని చేసిన సీవీ ఆనంద్ కు తిరిగి ఆ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఇదే సమయంలో మరికొన్ని కీలక హోదాల్లోని అధికారులను మార్పు చేసింది.

అవును.. తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా ప్రధానంగా... ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న కొత్తకోట శ్రీనివాస రెడ్డిని రేవంత్ సర్కార్ బదిలీ చేసింది. ఆ స్థానంలో సీవీ ఆనంద్ ని నియమించింది. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.

ఇదే సమయంలో... ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను బదిలీ చేసిది. ఇక, పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్ కు.. పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం రమేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది! త్వరలో మరికొంతమంది ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా... తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసింది.! అయితే.. తాజాగా ఆయనపై తాజాగా బదిలీ చేసింది! ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్ర సర్వీసుల నుంచి ప్రత్యేకంగా రాష్ట్రానికి రప్పించి సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించిన సీవీ ఆనంద్ ను రేవంత్ సర్కార్ మళ్లీ అదే స్థానంలో నియమించింది.