Begin typing your search above and press return to search.

ఆ లడ్డూ ధర వింటే కళ్లు తేలేయాల్సిందే !

అయితే ఆ తర్వాత లడ్డూలకు అనేక చోట్ల బాలాపూర్ లడ్డుకన్నా ఎక్కువ ధర పలికినా ఇప్పటికీ బాలపూర్ లడ్డే ఫేమస్.

By:  Tupaki Desk   |   17 Sept 2024 10:25 AM IST
ఆ లడ్డూ ధర వింటే కళ్లు తేలేయాల్సిందే !
X

గణేషుడి లడ్డూ అంటే బాలాపూర్ ఫేమస్. 30 ఏళ్ల క్రితం అక్కడ మొదలైన లడ్డూ వేలం పాట అప్పట్టో రూ.450 తో కొలను మోహన్ రెడ్డి దక్కించుకోగా, గత ఏడాది దానిని రూ.27 లక్షలకు భక్తులు దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత లడ్డూలకు అనేక చోట్ల బాలాపూర్ లడ్డుకన్నా ఎక్కువ ధర పలికినా ఇప్పటికీ బాలపూర్ లడ్డే ఫేమస్.

అయితే తాజాగా హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో లడ్డూ ధర వేలంలో ఏకంగా రూ.1.87 కోట్లు పలకడం ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది. గత ఏడాది ఇక్కడే లడ్డూ ధర రూ.1.20 కోట్లు పలకగా ఈ సారి ఏకంగా రూ.67 లక్షలు పెరిగి ఏకంగా కోటి 87 లక్షలకు చేరుకోవడం గమనార్హం.

హైదరాబాద్ మైహోం భూాజాలో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేష్ లడ్డూను వేలంపాటలో రూ.29 లక్షలకు దక్కించుకున్నాడు. గత ఏడాది ఇక్కడి లడ్డూ వేలంలో రూ.25.50 లక్షలు పలికింది. బాలాపూర్ లో మొదలయిన ఈ లడ్డూల వేలం ప్రతి ఏటా గణేష్ నిమజ్జనాల సమయంలో ఈ లడ్డూల వేలం పాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.