Begin typing your search above and press return to search.

బాప్‌రే.. హైదరాబాద్ డ్రంగ్ అండ్ డ్రైవ్ జరిమానాలు అన్ని కోట్లా..?

చాలా మంది మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడిన వారు ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 10:28 AM GMT
బాప్‌రే.. హైదరాబాద్ డ్రంగ్ అండ్ డ్రైవ్ జరిమానాలు అన్ని కోట్లా..?
X

మద్యం తాగి వెహికిల్స్ నడపదం అత్యంత ప్రమాదకరం. అది తీవ్ర నేరం కూడా. మద్యం తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో వాహనాలు నడపడం మరింత ప్రమాదకరం. చాలా మంది మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడిన వారు ఉన్నారు. వేలాది మంది ప్రమాదాల్లో ప్రాణాలు వదిలారు. ఎన్నో కుటుంబాన్ని ఛిన్నాభిన్నం అయ్యాయి.

ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను తగ్గించేందుకు నిత్యం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. కానీ.. ఎక్కడా వాటికి అడ్డుకట్ట పడలేదు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మద్యం సేవించి వాహనాన్ని నడపద్దని పోలీసులు అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. కొందరు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నా కూడా పెద్దగా మార్పు కనిపించడంలేదు.

గడిచిన మూడు నెలలకు సంబంధించిన పోలీసులు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఎన్ని వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయో వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు విధించిన జరిమానాలపైనా లెక్కలు వెల్లడించారు. 2024 ప్రారంభం నుంచి ఒక్క హైదరాబాద్‌లోనే 53,234 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జనవరి 1,2024 నుండి వచ్చిన రికార్డుల ప్రకారం మొత్తం 53,234 మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదయ్యాయి. వాటిలో 45,394 ద్విచక్ర వాహనాలకు సంబంధించినవి. 5,364 కేసులు ఫోర్ వీలర్‌కు సంబంధించినవి కాగా.. మిగిలిన 2,407 కేసులు త్రీ వీలర్ వాహనాలకు సంబంధించినవి అని తెలిపారు. మరోవైపు.. మద్యం తాగి వాహనాలు నడపడంలో ద్విచక్ర వాహనదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కారు నడిపి దొరికిన వారికంటే వీరి సంఖ్యనే ఎక్కువగా ఉందట. పర్మిట్ రూమ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లలో మద్యం తాగి ఇళ్లకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనదారులు ఇష్టపడుతారని డీసీపీ తెలిపారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలకు సైతం కారణాలు అవుతున్నారని తెలిపారు.

అంతేకాకుండా.. మద్యం మత్తులో వాహనాలు నడిపినందుకు హైదరాబాద్‌లో భారీగానే ఫైన్లు వేశారు హైదరాబాద్ పోలీసులు రూ.10.69 కోట్ల జరిమానా విధించారు. నగర ప్రయాణికులు మద్యం తాగి, జరిమానాలు చెల్లించిన నగదు ఇదంతా. బ్లడ్ ఆల్కహాల్ రీడింగ్ ఆధారంగా నేరాల సంఖ్య ఆధారంగా మద్యం తాగి వాహనం నడిపిన ఒక్కో కేసుకు రూ.10వేల వరకు జరిమానా విధించారు. కొందరిని జైలుుక సైతం పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికైనా వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపించవద్దని సూచించారు.