Begin typing your search above and press return to search.

గంటలో హైదరాబాద్ టు విజయవాడ... హైస్పీడ్ రైళ్ల అప్ డేట్ ఇదే!

అవును... దేశంలో త్వరలో హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయి. అలాంటిలాంటి హై స్పీడ్ కాదు.. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 12:30 AM GMT
గంటలో హైదరాబాద్  టు విజయవాడ... హైస్పీడ్  రైళ్ల అప్  డేట్  ఇదే!
X

సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు ట్రైన్ లో పట్టే సమయం కాస్త అటు ఇటుగా 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో ఉంటుందని అంటారు. అలాంటి ట్రైన్ జర్నీ ఒక గంటలో అయిపోతే ఎలా ఉంటుంది? త్వరలో ఆ అవకాశం కూడా ఉందని.. ఆ దిశగా పనులు మొదలయ్యాయని.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అవును... దేశంలో త్వరలో హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయి. అలాంటిలాంటి హై స్పీడ్ కాదు.. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. బీఈఎంఎల్ తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్ల తయారీ కొనసాగుతోందని తెలిపారు.

ఇదే సమయంలో.. వందేభారత్ రైళ్లు సక్సెస్ అయిన నేపథ్యంలో మేకిన్ ఇండియా స్ఫూర్తితో హైస్పీడ్ రైళ్ల తయారీ చేపట్టినట్లు వైష్ణవ్ తెలిపారు. దీనికోసం ఒక్కో బోగీకి ట్యాక్సులు మినహాయించి రూ.28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇతర బోగీలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువగా పేర్కొన్నారు.

అదేవిధంగా... గంటకు సుమారు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల సెట్ల తయారీ సంక్లిష్టమని, సాంకేతిక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయని చెప్పిన రైల్వే మంత్రి... సాధారణ రైళ్లతో పోలిస్తే వీటి ఏరోడైనమిక్ భిన్నంగా ఉంటాయని చెప్పారు. గాలి చొచ్చుకోవడానికి వీలు లేకుండా వీటి బాడీ ఉంటుందని తెలిపారు.

ఇందులో ఆటోమేటిక్ డోర్స్, బోగీకి బోగీకి మధ్య కనెక్టివిటీ, బయట వాతావరణానికి అనుగుణంగా బోగీ లోపలి పరిస్థితులు, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, సీసీటీవీ, ఫైర్ సేఫ్టీ ఎక్యూప్ మెంట్ లు ఉంటాయని అన్నారు. అయితే.. వీటిలో మొత్తం అన్నీ చైర్ కార్సే ఉంటాయని తెలిపారు.