భవిష్యత్ హైదరాబాద్ అంతా అక్కడే కేంద్రీకృతమా...?
హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు దేశంలోని మహామహా నగరాలకే సవాల్ విసురుతోంది.
By: Tupaki Desk | 22 Aug 2024 10:30 AM GMTహైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు దేశంలోని మహామహా నగరాలకే సవాల్ విసురుతోంది. ఇప్పటికే హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతూ నలువైపులా చుట్టు పక్కలా విస్తరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంటు సెగ్మెంట్లతో పాటు చేవెళ్ల, మెదక్ పార్లమెంటు సెగ్మెంట్లు కూడా పాక్షికంగా విస్తరించి ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోనే ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జోరుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 100 అంతస్తుల ఆకాశహర్మాలు ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌లో ఓ 500 వరకు నిర్మాణంలో ఉన్నాయంటేనే హైదరాబాద్ అభివృద్ధి ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అటు ముంబై రోడ్ వైపు సంగారెడ్డి వరకు విస్తరించేసింది. ఇటు భువనగిరి వరకు వచ్చేసింది.. అయితే ఇప్పుడు హైదరాబాద్ భవిష్యత్తుకు మరో కొత్త నగరం అలకారం కాబోతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ముచ్చెర్లను హైదరాబాద్‌లో నాలుగో నగరంగా అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో నగరంలో ఐటీ కారిడార్ విస్తరించకముందే శ్రీశైలం హైవే వైపు ఎక్కువుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచింది. ఆ తర్వాత ఇది ఇటు భువనగిరి వైపు.. అటు ఉప్పల్... ఇటు సంగారెడ్డి వైపు విస్తరించుకుంటూ పోయింది.
ఎప్పుడు అయితే రేవంత్ రెడ్డి ముచ్చెర్లను నగరంలో ఫోర్త్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారో ఇప్పుడు రియల్ బూమ్ అంతా ఒక్కసారిగా శ్రీశైలం హైవే వైపు కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముచ్చర్ల ప్రాంతం నుంచి శ్రీశైలం హైవే పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హైదరాబాద్ కి, ఇటు ముచ్చెర్లకి రెండిటికీ దగ్గర్లో ఉంది శ్రీశైలం హైవే వెళుతుంటుంది. ఇక్కడ సింపుల్‌గా పెట్టుబడులు పెట్టి భారీ రీటర్న్స్ తెచ్చుకోవాలనుకుంటోన్న వారు ఎక్కువ మందే ఉన్నారు.
ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ పనులు స్టార్ట్ అయితే శ్రీశైలం హైవే చుట్టుపక్కల రియల్ డిమాండ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం అక్కడ పాతిక లక్షలకు రెండు వందల గజాల వరకూ స్థలం లభిస్తోంది. ఇప్పుడు తక్కువ రేటులో అక్కడ స్థలం కొని పెట్టుకుంటే మరో పదేళ్ల తర్వాత అక్కడ పెద్ద పెద్ద కాలనీలు విస్తరించే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే శ్రీశైలం కాలనీల వైపే ఎంక్వైరీలు జరుగుతున్నాయట. రెండు మూడు నెలల్లో బడాబడా కంపెనీలు కూడా అటే వెళ్లనున్నాయి.