ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు... అవి అమ్మొద్దంటూ హెచ్చరికలు!
ఈ సమయంలో విద్యాశాఖ అధికారి ప్రైవేటు పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేశారు.
By: Tupaki Desk | 31 May 2024 12:09 PM GMTపాఠశాలలకు వేసవి సెలవులు త్వరలో ముగుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్స్ ప్రక్రియలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. వీటికి అనుగుణంగా పుస్తకాలతో పాటు యూనీఫామ్స్, షూలు, స్టేషనరీ సామాగ్రీ వంటి అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ఈ సమయంలో విద్యాశాఖ అధికారి ప్రైవేటు పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేశారు.
అవును... ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాఠశాల పరిసర ప్రాంతాల్లో లాభపేక్ష ఆశించి విక్రయాలు చేయవద్దంటూ హైదారాబాద్ జిల్లా విద్యాధికారి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులు విడుదల చేశారు. ఇందులో భాగంగా... హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాల ప్రాంగణంలో యూనీఫామ్స్, షూ, బెల్ట్ మొదలైన వాటిని విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో... ఈ ఆదేశాల మేరకు జిల్లాలోని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఇన్స్ పెక్టర్లు ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తారని, వారి కంటే ముందే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుని చూసుకోవాలని తెలిపారు.
ఇదే క్రమంలో... జిల్లాలో నడుస్తున్న స్టేట్, సీబీఎస్సీ, ఐ.సీ.ఎస్.ఈ. పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ, బెల్ట్, మొదలైన విక్రయాలు జరపకూడదు అని.. కోర్డు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్ లలో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు జరపవద్దని.. అలాంటివి ఏవైనా ఉంటే అవి వాణిజ్యేతర. లాభాపేక్ష లేని ప్రతిపాధికన ఉండాలని అన్నారు.
ఇదే సమయంలో... వీటిని ఉల్లంఘించిన పాఠశాలలకు తక్షణమే నోటీసులు జారీ చేయబడతాయని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి హెచ్చరించారు. అదేవిధంగా... ప్రైవేట్ పాఠశాలలను ఎల్లప్పుడూ పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని నోటీసులో స్పష్టం చేశారు. దీంతో... ఈ హెచ్చరికలపై పలువురు తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.