హైదరాబాద్ లో ఉంటున్నారా?... ఈ అప్ డేట్ తెలుసుకోవాల్సిందే!
హైదరాబాద్ లో జనాభా రోజు రోజుకీ ఏ స్థాయిలో పెరిగిపోతున్నారనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది.
By: Tupaki Desk | 20 Aug 2024 7:07 AM GMTహైదరాబాద్ లో జనాభా రోజు రోజుకీ ఏ స్థాయిలో పెరిగిపోతున్నారనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఇంటి అడ్రస్ పట్టుకోవడం తలకుమించిన భారం అవుతుంది. మ్యాప్ లేకుండా హైదరాబాద్ లో తెలియని ఓ ఇంటిని చేరుకోవడం ఆల్ మోస్ట్ అసాధ్యం అనేవారూ లేకపోలేదు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతీ ఇంటికీ నెంబర్ ఉన్నా.. అది వెతికి పట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని సార్లు పూటలు మారిపోవచ్చు. ఈ నేపథ్యంలో... గ్రేటర్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనకు అధికారులు మరో ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా... ప్రతీ ఇంటికీ ఓ యూనిక్ ఐడీ నెంబర్ ను కేటాయించనున్నారు. దీని ద్వారా క్యూర్ కోడ్ లాంటి ఓ బోర్డును ఏర్పాటు చేస్తారు.
అవును... జీ.హెచ్.ఎం.సీ పరిధిలో ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనలో భాగంగా అధికారులు మరో ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఇంటికీ క్యూఆర్ కోడ్ లాంటి ఓ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన జియోగ్రాఫిక్ ఇన్ ఫర్మేషన్ సిస్టం సర్వేను అధికారులు ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ కోడ్ ను స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన వివరాలతో పాటు ఎగ్జాట్ లొకేషన్ కూడా వస్తుంది.
వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటి అడ్రస్ తెలుసుకోవడం అంత సులువైన పనికాదు. 10 మీటర్ల దూరంలోనే ఉంటూ అక్కడక్కడే తిరుగుతారు కానీ.. అసలు లొకేషన్ ను చేరుకోలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికలపై ఇప్పుడు లొకేషన్ క్యూఆర్ కోడ్ ను ముద్రించడం కామన్ అయిపోయింది. అయితే అది అందరికీ సాధ్యం కాకపొవచ్చు కూడ్దా. ఈ నేపథ్యంలో ప్రతీ ఇంటికీ ఓ క్యూఆర్ కోడ్ ను ఇవ్వాలనే జీ.హెచ్.ఎం.సీ ఆలోచన త్వరలో పూర్తవనుందని అంటున్నారు.
ఈ జియోగ్రాఫిక్ ఇన్ ఫర్మేషన్ సిస్టం సర్వేని హైదరాబాద్ శాటిలైట్, గ్రౌండ్ ఫిజికల్ విధానంలో నిర్వస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్ వంటి ఐదు సర్కిల్స్ లో ప్రయోగాత్మకంగా సర్వే ప్రారంభించారు. త్వరలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పని మొదలై, పూర్తై ప్రతీ ఇంటికీ క్యూ ఆర్ కోడ్ రానుందని చెబుతున్నారు.