Begin typing your search above and press return to search.

కెనడాలో హైదరాబాద్‌ విద్యార్థి మృతి.. కారణం ఇదే!

అవును... ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి రకరకాల కారణాలతో పలువురు భారతీయులు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Feb 2024 8:27 AM GMT
కెనడాలో హైదరాబాద్‌  విద్యార్థి మృతి.. కారణం ఇదే!
X

విదేశాల్లో ఉన్నత చదువులకోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు మృత్యువాత పడుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఇప్పటివరకూ సంభవించిన మరణాలు ప్రమాధాల వల్ల జరిగితే... తాజాగా ఒక విద్యార్థి కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందారు. ఈ దారుణం కెనడాలో చోటు చేసుకోగా... ఆ విద్యార్థి హైదరాబాద్ కి చెందిన వారు!

అవును... ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి రకరకాల కారణాలతో పలువురు భారతీయులు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసమని కెనడాకు వెళ్లిన హైదరాబాద్‌ వాసి కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్‌ కు చెందిన షేక్‌ ముజమ్మిల్‌ అహ్మద్‌ (25) 2022లో కెనడా వెళ్లి అక్కడ ఒంటారియాలోని కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్‌ చదువుతున్నాడు. అయితే వారం రోజులుగా అహ్మద్ జ్వరంతో బాదపడుతున్నాడని తెలుస్తుంది. ఈ సమయంలో శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ తో మృతిచెందాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు కుటుంబ సభ్యులకు వెళ్లడించారు.

ఇందులో భాగంగా... ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లా ఖాన్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ... షేక్‌ ముజమ్మిల్‌ అహ్మద్‌ స్నేహితుడు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారని తెలిపారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు. మరోపక్క అహ్మద్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కేంద్ర మంత్రి ఎస్‌. జైశంకర్‌ ను అతడి కుటుంబం అభ్యర్థించింది.

కాగా... ఇటీవల అమెరికాలోని చికాగోలో హైదరాబాద్‌ కు చెందిన మరో విద్యార్థి దాడికి గురైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... లంగర్‌ హౌజ్‌ హషీం నగర్‌ కు చెందిన సయ్యద్‌ మజాహిర్‌ అలీపై గుర్తుతెలియని నలుగురు దుంగడులు దాడి చేశారు. దాడికి ముందు అలీని తరుముతున్నట్లుగా ఉన్న విషయం సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించింది. అనంతరం తనపై జరిగిన దాడిని అలీ తీవ్ర గాయాలతోనే వీడియో ద్వారా వెల్లడించారు.