తరచూ సెల్ చూడటాన్ని ప్రశ్నించినందుకు టీనేజర్ సూసైడ్
ఎంతసేపు చేతుల్లో సెల్ ఫోన్ తప్పించి మరింకేమీ లేదా? అంటూ కోపగించుకున్నారు.
By: Tupaki Desk | 17 Sep 2023 4:32 AM GMTహైదరాబాద్ మహానగరంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. అదే పనిగా సెల్ ఫోన్ చూస్తున్న కుమార్తెను మందలించిన తండ్రి.. కుటుంబానికి ఒక టీనేజర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఉదంతం షాకింగ్ గా మారింది. అదే పనిగా సెల్ చూడటం ఏమిటి? అంటూ మందలింపును నెగిటివ్ గా తీసుకున్న పదమూడేళ్ల అమ్మాయి ఉదంతం ఇప్పుడు అవాక్కు అయ్యేలా చేస్తోంది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతంలోకి వెలితే.. పశ్చిమ బెంగాల్ లోని కోచ్ బెహర్ కు చెందిన సంజీబ్ కుటుంబం కొన్నేళ్లుగా నూర్ నగర్ లో నివాసం ఉంటోంది.
ఎలక్ట్రీషియన్ గా పని చేసే అతడికి ఇద్దరు కుమార్తె. పెద్ద కుమార్తెకు పదమూడేళ్లు.స్కూల్ నుంచి వచ్చినంతనే సెల్ ఫోన్ తీసుకొని గంటల కొద్దీ దానితోనే కాలక్షేపం చేస్తున్న తీరును ఇంట్లో వారు మందలించేవారు. తాజాగా సెల్ చూస్తున్న కూతుర్ని చూసినంతనే ఆ తండ్రి ఆగ్రహానికి గురయ్యారు.
ఎంతసేపు చేతుల్లో సెల్ ఫోన్ తప్పించి మరింకేమీ లేదా? అంటూ కోపగించుకున్నారు. కాసేపటికి ముందు గదిలో టీవీ చూస్తుండిపోయారు. బాత్రూంకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా.. తలుపు మూసి ఉంది. ఎంత కొట్టినా డోర్ తీయకపోవటంతో.. తలుపులు బ్రేక్ చేసి ఛూడగా.. బెడ్రూంలో ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకున్న వైనాన్ని గుర్తించారు.
వెంటనే 108ను పిలిపించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. అదే పనిగా సెల్ చూస్తున్న కుమార్తెను మందలించిన తండ్రికి.. వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయిందా బాలిక.