మొత్తానికి సోషల్ మీడియా మంచే చేసింది
మూడు నెలల క్రితం జనవరి 17న హైదరాబాద్‌లో ఉండే 17 ఏళ్ల జయేశ్ కనోడియా మిస్సయ్యాడు
By: Tupaki Desk | 6 May 2024 11:30 PM GMTసోషల్ మీడియా. ప్రస్తుత ప్రపంచంలో ఒక ప్రత్యామ్నాయ వేదిక. ఇది సామాన్యులలో ఉన్న కళను బయటకు తీసుకురావడానికి దోహద పడుతుండగా, మరో వైపు అంతకు మించిన అనర్థాలకు కూడా కారణమవుతుంది. అయితే సోషల్ మీడియా పుణ్యాన ఒక కుటుంబానికి మంచి మేలు జరిగింది.
మూడు నెలల క్రితం జనవరి 17న హైదరాబాద్‌లో ఉండే 17 ఏళ్ల జయేశ్ కనోడియా మిస్సయ్యాడు. దీంతో అతని కుటుంబం అతనికోసం వెతుకుతూ ఉంది. జూబ్లీహిల్స్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారు. హైదరాబాద్‌లో అదృశ్యమయ్యాక జనవరి 24న చివరిసారి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జయేష్ కనిపించాడు. ఆ తర్వాత అతని జాడ తెలియడం లేదు.
ఆదివారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ కేఫ్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండగా జయేశ్ కనిపించడం లేదని, అతడి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ అతడి ఫొటోతో ఓ పోస్టు కనిపించింది. అక్కడే పనిచేస్తున్న జయేష్ అని అనుమానం వచ్చి మళ్లీ చూశాడు. ఆ తర్వాత అతడు జయేశ్ అని నిర్ధారించుకుని ఆ పోస్టులో ఇచ్చిన కాంటాక్ట్ నంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఆ తర్వాత జయేష్ తల్లిదండ్రులు వీడియో కాల్ అక్కడ పనిచేస్తున్న అబ్బాయి కుమారుడేనని నిర్ధారించుకుని అతడిని తెచ్చుకునేందుకు అమృత్ సర్ బయలుదేరారు.